Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహిళా వారోత్సవాలు: మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు..!!

మహిళా దినోత్సవ వేడుకలను వారం రోజుల పాటు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8 నుంచి పురపాలక శాఖ మహిళా వారోత్సవాల నిర్వహణ పైన మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మహిళా వారోత్సవాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ కార్యాచరణను ప్రకటించింది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ప్రారంభమయ్యే ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించనుంది. వారం పాటు నిర్వహించే ఈ మహిళ వారోత్సవాల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం మహిళా రక్షణ..సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల పై అధికారులకు దిశా నిర్దేశం చేసారు. మహిళలకు హెల్త్ క్యాంపుల నిర్వహణ, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సన్మానం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పట్టణాల్లో మహిళ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తయారైన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల క్యాంపులు నిర్వహించాలని సూచించారు.

కంటి వెలుగు ద్వారా పురపాలక శాఖలోని మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా రక్షణ, మహిళ ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారికత వంటి అంశాల పైన ప్రత్యేక సమావేశాలు చర్చాగోష్టులను నిర్వహించి మరింత అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

Minister KTR decided to organise Womens day celebrations in All municipalities, Directions for Officials

ప్రభుత్వ రుణాలు, సబ్సిడీల వంటి వాటిని వినియోగించుకొని స్వయం సమృద్ధి సాధించిన వివిధ రంగాలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా గుర్తించాలని కేటీఆర్ నిర్దేశించారు. పురపాలికల్లో ఏదైనా ఒక రంగంలో ముఖ్యంగా డ్రై కంపోస్ట్.. కిచెన్ కాంపోస్టింగ్ తో పాటుగా నీటి సంరక్షణ లాంటి మొదలైన రంగాల్లో ఆదర్శవంతమైన పద్ధతుల్లో ముందుకెళ్తున్న పురపాలికల సిబ్బంది లేదా పట్టణంలోని మహిళలను ప్రత్యేకంగా గుర్తించి వారిని సన్మానించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్లను, పోలీస్ ఉన్నతాధికారులు, మహిళా జడ్జీల వంటి వారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి ఈ కార్యక్రమాలను నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ వారోత్సవాల్లో మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసే కార్యక్రమాలను కూడా సిద్ధం చేయాలని కేటీఆర్ సూచించారు. పక్కా ప్రణాళికతో మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+