సికింద్రాబాద్ లో వీటి నిర్మాణానికి కేంద్రం గ్నీన్ సిగ్నల్

Revanth Reddy: హైదరాబాద్ కోర్ సిటీకి మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టి సారించింది. కోర్ అర్బన్ సిటీతో పాటు, సెమీ అర్బన్, రూరల్, అవుటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాలను పూర్తిస్థాయి అభివృద్ధిపై ప్రత్యేకంగా ప్రణాళిక aను రూపొందించనుంది.

పెరుగుతున్న హైదరాబాద్ నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్రమైన పాలసీని తయారు చేయాలని ఆదేశించారు.

Ministry of Defence transfer of 6 85 lakh square meters of land to the Telangana govt

దీనికి అనుగుణంగా హెచ్ఎండీఏ కిందటి నెల 29వ తేదీన రక్షణ మంత్రిత్వ శాఖతో ఓ పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల్లో భాగంగా రెండు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందాల్లో భాగంగా తాజాగా రక్షణ మంత్రిత్వ శాఖ 6.85 లక్షల చదరపు మీటర్ల భూమిని హెచ్ఎండీఏకు బదలాయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపింది. వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమం (SRDP) కింద ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మితం కానున్నాయి.

జూబ్లీ బస్ స్టేషన్ నుండి షామీర్‌పేట్ వరకు రాష్ట్ర రహదారి-1, మరొకటి జాతీయ రహదారి-44ను కనెక్ట్ చేస్తాయి ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్లు. ఇందులో ఎస్ హెచ్-1 విలువ 954 కోట్ల రూపాయలు. ఎన్ హెచ్-44 విలువ 748 కోట్ల రూపాయలు. ఎస్ హెచ్ 1 కారిడార్‌ లో 4,59,222.70 చదరపు మీటర్ల రక్షణ భూమి ఉంటుంది.

ఎన్ హెచ్- 44 కారిడార్‌లో 2,26,039.91 చదరపు మీటర్లు. ఇందులో ఆర్మీ, వైమానిక దళం, డీఆర్డీఓ, డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అస్యూరెన్స్, డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోకి వచ్చే పలు స్థిరాస్తులు ఉన్నాయి.

పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో ఈ కారిడార్లను హెచ్ఎండీఏ నిర్మిస్తుంది. ప్యారడైజ్ జంక్షన్ (జింఖానా గ్రౌండ్స్) నుండి షామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు దాదాపుగా 18.14 కిలో మీటర్ల వరకు ఒకటి, ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫామ్ రోడ్ వరకు సుమారు 5.32 కిలో మీటర్ల వరకు మరొక కారిడార్ అందుబాటులోకి వస్తుంది.

ప్యారడైజ్ జంక్షన్ నుండి షామీర్‌పేట్ కారిడార్- వెస్ట్ మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, ఆల్వాల్, హకీంపేట్, తుంకూరు మీదుగా నిర్మితమౌతుంది. ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫామ్ రోడ్ వరకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్- సికింద్రాబాద్, తాడ్‌బండ్ జంక్షన్, బోయిన్‌పల్లి జంక్షన్ వంటి ప్రాంతాల గుండా వెళుతుంది. ఇది డైరీ ఫామ్ రోడ్ వద్ద ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+