సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పర్యటనల్లో మార్పులు: షెడ్యూల్ ఇలా

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. నూతన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్ 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించే సభల్లో సీఎం పాల్గొననున్నారు. 27న పాలేరు, మహబూబాబాద్‌, వర్దన్నపేటల్లో సీఎం కేసీఆర్‌ సభలు జరుగనున్నాయి. మిగతా సభలు యథావిధిగా జరుగనున్నాయి.

ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం 26వ తేదీన అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడులో సభలు జరగాల్సి ఉంది. అయితే, నాగర్‌కర్నూలులో జరగాల్సిన సభను వనపర్తికి మార్చారు. ఇక, అక్టోబర్ 27వ తేదీన పాలేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో పర్యటించాల్సి ఉండగా.. కొత్త షెడ్యూల్‌ ప్రకారం పాలేరు, మహబూబాబాద్‌, వర్దన్నపేటకు సభలను మార్చారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే.

minor changes in the visits of telangana cm kcr constituencies

సీఎం కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్‌:

అక్టోబర్‌ 29 కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
అక్టోబర్‌ 30 జుక్కల్‌, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌
అక్టోబర్‌ 31 హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ
నవంబర్‌ 01 సత్తుపల్లి, ఇల్లెందు
నవంబర్‌ 02 నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి
నవంబర్‌ 03 భైంసా(ముధోల్‌), ఆర్మూర్‌, కోరుట్ల
నవంబర్‌ 05 కొత్తగూడెం, ఖమ్మం
నవంబర్‌ 06 గద్వాల్‌, మఖ్తల్‌, నారాయణపేట
నవంబర్‌ 07 చెన్నూరు, మంథని, పెద్దపల్లి
నవంబర్‌ 08 సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. నవంబర్‌ 9న ఒకేరోజు ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తారు కేసీఆర్. ఆనవాయితీ ప్రకారం నంబర్ 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఆ తర్వాత గజ్వేల్‌లో మొదటి నామినేషన్‌, మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్‌ దాఖలు చేస్తారు. 4 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ పోటీ చేస్తుండగా.. బీజేపీ తరపున కాటిపల్లి వెంకటరమణారెడ్డిని పోటీ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+