రెండు లారీలు ఢీ, రెప్పపాటులో ప్రమాదం నుంచి తప్పించుకొన్న వ్యక్తి.. వీడియో వైరల్..

భూమి మీద నూకలు ఉంటే చాలు.. ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడొచ్చు. ఈ విషయం మరోసారి రుజువయ్యింది. సంగారెడ్డి శివారు చౌరస్తాలో రెండు లారీలు ఢీ కొనగా.. అందులో చిక్కుకొన్న ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. సీసీటీవీలో రికార్డైన ఫుటేజీలో అతను నడుచుకుంటూ వస్తున్నట్టు కనిపించింది. ప్రమాదం నుంచి బయటపడటంతో అతనితోపాటు.. ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

సంగారెడ్డి శివారు పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో బుధవారం తెల్లవారుజామున లారీలు ఢీ కొన్నాయి. ఒకే దారిలో వెళ్తున్న లారీలో డ్యాష్ ఇచ్చుకున్నాయి. అయితే లారీ మధ్యలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతూ.. ఇరుక్కుపోయాడు.. కానీ ఎలాంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మృత్యువును దగ్గరి వరకు వెళ్లి చూసొచ్చినా అతను బతుకుజీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు. ఫుటేజీ తీసిన స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు.

Miraculous escape for man crossing road as 2 lorries collide..

Recommended Video

    Namaste Trump: Trump's Road Show From Airport To Motera Stadium | Oneindia Telugu

    రోడ్డుపై బ్యాగు తీసుకొని వస్తోన్న వ్యక్తి కుడి వైపు నుంచి లారీ వస్తోండగా.. వెనకాల నుంచి మరో లారీ వేగంతో వచ్చింది. రెప్పపాటులో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే డివైడర్ ఉండటంతో అతను ప్రమాదం నుంచి సేఫ్‌గా బయటపడ్డాడు. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఫుల్ లోడ్ ఉన్న లారీ.. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరింగింది. పోతిరెడ్డిపల్లి నుంచి వస్తోన్న లారీ ఎదరెదురుగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెప్తున్నారు. రెండు లారీలు రహదారిపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే రంగప్రవేశం చేసిన పోలీసులు.. లారీలను రోడ్డు నుంచి తొలగించి.. ట్రాఫిక్ క్లియర్ చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+