అల్లు అర్జున్ పాన్ వరల్డ్ హీరో.. అరెస్టుపై దానం నాగేందర్ సంచలనం

సంధ్య థియేటర్ ఘటన కేసులో సినీనటుడు అల్లు అర్జున్ శుక్రవారం అరెస్టై.. శనివారం ఉదయం విడుదలైన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అయితే, ఆ తర్వాత హైకోర్టు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది. కానీ, బెయిల్ పేపర్లు సరైన సమయంలో చంచల్‌గూడ జైలు అధికారులకు అందకపోవడం, అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తీసుకొచ్చిన బెయిల్ పేపర్లు సరిగాలేకపోవడంతో ఆయన శుక్రవారం అర్ధరాత్రి వరకు జైలులోనే ఉన్నారు. అయితే, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బెయిల్ పేపర్లు జైలు అధికారులు అందాయి.

MLA Danam Nagender responds to Allu s arrest

అర్ధరాత్రి కావడంతో శనివారం ఉదయం అల్లు అర్జున్‌ను జైలు అధికారులు విడుదల చేశారు. దీంతో నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు అల్లు అర్జున్. ఇక్కడ పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలిసి పరామర్శించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు.దీంతో అక్కడ కొంత భావోద్వేగ వాతావరణం నెలకొంది.

కాగా, ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అల్లు అర్జున్ అరెస్టును తప్పు బట్టిన విషయం తెలిసిందే. తాజాగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అల్లు అరెస్టు విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోనే కాదు.. పాన్ వరల్డ్ హీరో అని దానం నాగేందర్ కొనియాడారు.

అల్లు అర్జున్ తనకు బంధువని దానం నాగేందర్ తెలిపారు. అల్లు అరెస్ట్ కావడం బాధాకరమని అన్నారు. ఆయన అరెస్టుపై విచారం వ్యక్తం చేశారు దానం. బెయిల్ దొరకడంతో సంతోషంగా ఉందన్నారు. అల్లు అర్జున్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల పేర్లను తీసుకెళ్లి మంచి పేరు తెచ్చారని అన్నారు.

అల్లు అర్జున్ పాన్ ఇండియానే కాదు.. పాన్ వరల్డ్ హీరో అని మరోసారి ప్రశంసించారు. ఆయన అరెస్టు కావడం దురదృష్ణకరమైన సంఘటనగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయించిందని ప్రతిపక్షాలు అనడం సరికాదని అన్నారు. కాగా, నాలుగు వారాలపాటు అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి ప్రాణాలు కోవడం బాధాకరమని, ఇందుకు ఆయన క్షమాపణలు చెప్పారు. రేవతి కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఇప్పటికే రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ. 25 లక్షల సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+