వైరల్ వీడియో : మల్లారెడ్డి కోడలు డాన్స్ అదుర్స్.. స్టెప్పులు అదరగొట్టారుగా !!
తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అనగానే గుర్తొచ్చే పేర్లలో ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఒకరు. ప్రస్తుతం తెలంగాణలోని మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వ్యాపారవేత్తగా ప్రారంభమైన ఆయన ప్రయాణం.. విద్యాసంస్థల వ్యవస్థాపకుడిగా, ఆపై రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పొలిటికల్ గా కంటే కూడా తన స్పీచ్ లు, ఇంటర్వ్యూలతో వైరల్ గా మారారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన కోడలు ప్రీతి రెడ్డి వీడియో వైరల్ గా మారడం హాట్ టాపిక్ అవుతోంది.
వైరల్ వీడియో..
ఇటీవల ప్రీతి రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె మల్లారెడ్డి విద్యా సంస్థ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఎలాంటి మొహమాటం లేకుండా.. ఫుల్ ఎనర్జీతో స్టెప్స్ వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ వీడియోలో వెనుక నిలబడి ఆమెను గమనిస్తున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి సంతోషంగా చిరునవ్వు చిందించటం కూడా కెమెరాలో క్యాప్చర్ అయ్యింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మంచిగా రెస్పాండ్ అవుతున్నారు.

ప్రీతి రెడ్డి రాజకీయ కుటుంబానికి చెందినప్పటికీ, ఆమె మొదట రాజకీయాల కంటే విద్యా రంగంపైనే దృష్టి పెట్టారు. ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్లో ప్రముఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన విద్యా సంస్థల్లో తరచూ నిర్వహించే సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. అందుకే విద్యార్థులు ఆమెను "మ్యానేజ్‌మెంట్‌లో ఉన్నా స్టూడెంట్స్ ఫ్రెండ్" అని పిలుస్తుంటారు.
ప్రీతి రెడ్డి కేవలం విద్యా రంగంలోనే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా ఉంటారు. అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, పేద విద్యార్థుల విద్యా సహాయం వంటి అనేక కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తారు. ప్రత్యేకించి మహిళా సాధికారతపై అవగాహన కల్పించే కార్యక్రమాలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటుంటారు. అలానే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యార్థులతో గడిపిన క్షణాలను షేర్ చేస్తూ ఉంటారు. యువతలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.
డ్యాన్స్ చేస్తున్న BRS MLA మల్లారెడ్డి కోడలు !
— Anil Reddy (@anil_reddy45) October 16, 2025
😳😳😳😳😳😳😳 pic.twitter.com/0F1jcBvQP1












Click it and Unblock the Notifications