ఈడీ ఎదుట హాజరైన కవిత.. వెన్నుతట్టి పంపిన భర్త; నేడు విచారణలో కీలకమిదే!!
ఈడీ ఎదుట హాజరైన కవితను వెన్నుతట్టి భర్త అనిల్ పంపారు. నేడు విచారణలో కవితను ఒంటరిగా విచారిస్తారా? లేకా అరుణ్ రామచంద్ర పిళ్ళై తో కన్ ఫ్రంటేషన్ చేస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.
దేశ రాజధాని ఢిల్లీలో కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు మరో మారు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవితను భర్త అనిల్ వెన్ను తట్టి ధైర్యంగా విచారణ ఎదుర్కొని రావాలని పంపించారు. కవితతో పాటు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత భర్త అనిల్ ఆమెకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి ఈడీ కార్యాలయం లోపలికి పంపారు. వీరితోపాటు న్యాయవాది సోమ భరత్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
కవిత ఈడీ విచారణ.. ఢిల్లీలో కేటీఆర్, నేతల సమాలోచనలు
ఎమ్మెల్సీ కవితతో పాటు బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు కూడా ఈడీ కార్యాలయం దాకా వెళ్లారు. ఇక విచారణకు ముందు మరోమారు న్యాయ నిపుణులతో చర్చించిన కవిత, తనను ఈడి అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి? వాటిని తాను ఎలా ఎదుర్కోవాలి అనేది? వారితో సమాలోచనలు జరిపారు. ఇక కవితతో పాటు కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కూడా నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకొని ఈడీ విచారణ నేపథ్యంలో చేయవలసిన దానిపై, భవిష్యత్తు కార్యాచరణ పై ఢిల్లీలోని పలువురితో సమాలోచనలు జరిపారు. బీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు లతో కలిసి కవిత నివాసంలో చర్చలు జరిపారు.

నేడు కవితను విచారిస్తున్న ఈడీ
ఇక ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు మూడోమారు నోటీసులు ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్, సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు. ఇక ఈడీ అధికారులకు సహకరిస్తున్న కవిత, వారు అడిగిన ప్రతి డాక్యుమెంట్ ను వారికి అందిస్తున్నారు. ఇప్పటికే బ్యాంకు స్టేట్మెంట్ తో సహా ఈడి అధికారులు అడిగిన 12 డాక్యుమెంట్లను కవిత వారికి అందజేశారు.
ఈడీ కార్యాలయానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..!!#MLCKavitha #Kavitha #ED #DelhiLiquorScam #DelhiLiquorPolicyScam #Oneindiatelugu pic.twitter.com/0JRwsNE853
— oneindiatelugu (@oneindiatelugu) March 20, 2023
ఈడీ విచారణపై కవిత పోరాటం.. సుప్రీం లో కవిత పిటీషన్ 24న విచారణ
అయితే ఈడి విచారణ నేపథ్యంలో ఈడీ విచారణ రాజ్యాంగబద్ధంగా జరగడం లేదని కవిత ఇప్పటికే అసహనం వ్యక్తం చేశారు. మహిళలను ఈడి అధికారులు ఎవరైనా విచారించాలి అంటే ఇంటి వద్దనే విచారించాలని, కానీ అందుకు భిన్నంగా ఈడి అధికారులు కార్యాలయానికి పిలుస్తున్నారని కవిత ఆరోపించారు. ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత ఈడి జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఎమర్జెన్సీ పిటిషన్ గా దీన్ని తీసుకోవాలని కవిత కోరినప్పటికీ, సుప్రీంకోర్టు కవితకు విజ్ఞప్తిని తోసిపుచ్చి మార్చి 24వ తేదీన పిటిషన్ విచారించడానికి స్వీకరించింది.
#WATCH | Delhi: BRS MLC K Kavitha leaves from the residence of her father, Telangana CM K Chandrashekar Rao, for the ED office.
— ANI (@ANI) March 20, 2023
She is appearing before the agency in connection with the liquor policy case. pic.twitter.com/xJlnKkLn4b
నేడు రామచంద్ర పిళ్ళై తో కన్ఫ్రంటేషన్ ఉంటుందా? ఉత్కంఠ
ఇదిలా ఉంటే ఈనెల 11వ తేదీన విచారణకు హాజరైన కవిత తిరిగి చిరునవ్వుతో బయటకు వచ్చారు. ఆపై మళ్ళీ 16వ తేదీన కవితను, అరుణ్ రామచంద్ర పెళ్లై లతో కన్ ఫ్రంటే కాన్ఫ్రెంటేషన్షన్ విచారణ జరుపుతారా? ఈ కేసులో ఈరోజు ఈడీ అనుసరించబోతున్న వ్యూహం ఏమిటి అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అరుణ్ రామచంద్ర పిళ్ళై కవితకు బినామీ అని ఈడీ భావిస్తున్న నేపధ్యంలో, మనీలాండరింగ్ వ్యవహారంపై నేటి విచారణ సర్వత్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది. నేటితో ఈడీ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్ళై కస్టడీ పూర్తి కానుంది. ఈ నేపధ్యంలో నేడు విచారణపై ఆసక్తి అందరిలో కనిపిస్తుంది.
Delhi: BRS MLC K Kavitha leaves from the residence of her father, Telangana CM K Chandrashekar Rao, for the ED office
— ANI (@ANI) March 20, 2023
She is appearing before the agency in connection with the liquor policy case. pic.twitter.com/J3DwLQ6KMv












Click it and Unblock the Notifications