MLC Kavitha ఆశలపై నీళ్ళు పోసిన జడ్జి!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కష్టాలు తీరడం లేదు. బెయిల్ కోసం శతవిధాలా ప్రయత్నం చేస్తున్న కవితకు ఏ కోర్టుకు వెళ్లిన సుదీర్ఘ నిరీక్షణ తప్పడం లేదు. తాజాగా నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉండగా విచారణ జరగకపోవడంతో కవిత ఆశల మీద నీళ్లు చల్లినట్లు అయింది.
కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ వాయిదా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే సిబిఐ ప్రత్యేక రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి సెలవులో ఉండడంతో నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఇక కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై మళ్లీ విచారణ ఈనెల 22వ తేదీన లేదా 23వ తేదీన జరగనునట్టు సమాచారం.

మార్చి 15వ తేదీ ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఉక్కిరిబిక్కిరి
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవిత మార్చి 15వ తేదీ నుండి అటు ఈడీ విచారణను, ఇటు సిబిఐ విచారణను ఎదుర్కోవడంతో పాటు, తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ ను అనుభవిస్తున్నారు. మద్యం కేసులో తాను నిర్దోషినని, తనకు ఎటువంటి సంబంధం లేదని, రాజకీయ దురుద్దేశంతోనే తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్తున్నారు.
బెయిల్ పిటీషన్ పై ఆశలు పెట్టుకున్న కవిత ..కానీ
కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసి పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టేసిన జడ్జ్, ఆమెను జుడీషియల్ రిమాండ్ కు తరలించారు. ఇక రెగ్యులర్ బెయిల్ పైన ఆశలు పెట్టుకున్న కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేసే జడ్జి సెలవులో ఉండడంతో ఈ నెల 22న లేదా 23వ తేదీన బెయిల్ పిటీషన్ విచారణ జరగనుంది.
సీబీఐ అరెస్ట్ తో ఇంకో బెయిల్ పిటీషన్ .. విచారణ అప్పుడే
ఇదిలా ఉంటే సిబిఐ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత ప్రధాన సూత్రధారి అని, అవినీతిపై విచారణ జరపాలని ఆమెను అరెస్ట్ చేయటంతో, ఈ కేసులో కూడా కవిత బెయిల్ పిటిషన్ ను నిన్న కోర్టులో దాఖలు చేశారు. పైన కూడా 22వ తేదీన విచారణ జరిగే అవకాశం ఉంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications