సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టండి.. లేదంటే జరిగేదిదే: ఎమ్మెల్సీ కవిత వార్నింగ్!!
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ను లంగా అంటూ అనుచిత వ్యాఖ్యలతో దూషించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏకంగా చెప్పు చూపిస్తూ చెప్పుతో కొడతానని నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి పై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. కెసిఆర్ జోలికొస్తే తొక్కి పడేస్తా అంటూ హెచ్చరించారు. దీంతో బాల్క సుమన్ పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు.

Recommended Video

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి వైఖరిపై మండిపడిన కవిత కెసిఆర్ పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డి పై కేసులు నమోదు చేయకపోతే తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కవిత తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే దళిత బిడ్డ బాల్క సుమన్ పై కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టిన ఆమె, బాల్క సుమన్ పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబించిన విధానాలను ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తోందని కవిత ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే , దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2024
నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుంది.…
తెలంగాణ రాష్ట్ర పాలన ఢిల్లీ రిమోట్ కంట్రోల్తో నడుస్తోందని, ఇది రాచరిక వ్యవస్థను తలపిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని కవిత పేర్కొన్నారు. సూర్యుడిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుంది అన్న విషయం రేవంత్ రెడ్డి మరిచిపోవద్దని కవిత సూచించారు.












Click it and Unblock the Notifications