Koushik Reddy: మరో వివాదంలో ఎమ్మెల్సీ పాడి .. బీఆర్ఎస్‍కు తలనొప్పిగా మారిన కౌశిక్ రెడ్డి..!
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. కౌశిక్ రెడ్డి తరుచూ ఏదో వివాదంలో చిక్కుకునే ఉంటున్నారు. తాజాగా కౌశిక్ రెడ్డి, ఆయన డ్రైవర్ తనను కులం పేరుతో దూషించారని సాయికృష్ణ అనే వ్యక్తి కరీంనగర్ సీపీకీ ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి డ్రైవర్ తనపై దాడి చేశారని సాయి కృష్ణ ఆరోపించారు. జులై 13న కౌశిక్ డ్రైవర్ వేణు సంపత్ తనపై దాడి చేశారని సాయికృష్ణ చెప్పారు. ఇదే విషయాన్ని కౌశిక్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా కులం పేరు దూషించారని సాయి ఆరోపించాడు. కౌశిక్ రెడ్డి తనను బయటకు గెంటించాడని చెప్పాడు.
కౌశిక్ రెడ్డిని ఈటల రాజేందర్ ను ఎదుర్కొవడానికి కేసీఆర్ రంగంలోకి దించారు. అక్కడ గెల్లు శ్రీనివాస్ ఉన్నా.. అతన్ని కాదని కౌశిక్ రెడ్డిని ఎక్కువగా ప్రోత్సహించింది. కౌశిక్ రెడ్డికి ఏకంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో అక్కడ కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ వర్గాలు ఆధిపత్య పోరు కొనసాగింది. ఇది గమనించిన బీఆర్ఎస్ అధిష్ఠానం.. గెల్లు శ్రీనివాస్ కు టూరిజం కార్పొరేషన్ ఇచ్చారు. దీంతో హుజురాబాద్ లో పట్టు సాధించుకోవాలని కౌశిక్ రెడ్డికి సూచించింది. కానీ కౌశిక్ రెడ్డి తన పట్టును పెంచుకోవడం పక్కన పెట్టి పలు వివాదాల్లో కేంద్ర బిందువుగా మారుతున్నారు.

కౌశిక్ రెడ్డి వ్యవహార శైలితో సొంత పార్టీ నేతలే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డిని ప్రోత్సహించింది. హుజురాబాద్ టికెట్ కౌశిక్ రెడ్డికే ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం తన మార్గాన్ని మార్చుకోవడం లేదు. కొద్ది నెలల క్రితం గవర్నర్ తమిళిసై అనుచితి వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నాడు. చివరికి మహిళా కమిషన్ ముందుకు వెళ్లి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయినా కూడా కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోలేదు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో రైతులపై అనవసరంగా నోరు పారెసుకుని మరోసారి వార్తుల్లో నిలిచారు.
ఆ తర్వాత ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఉద్ధేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంధించిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పెద్ద ఎత్తున ఆయన విమర్శలు వచ్చాయి. ఇలా అనేక సందర్భల్లో కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నాడట. దీంతో అక్కడ కౌశిక్ రెడ్డి కాకుండా మరొకరిని బరిలోకి దించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డికి టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications