విజయశాంతికి మంత్రి పదవి వేళ అనూహ్య పరిణామాలు..!!

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ కు రంగం సిద్దం అవుతోంది. కొత్తగా అయిదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పుల దిశగా తుది కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొత్త మంత్రులను దాదాపు ఖరారు చేసారు. ఇదే సమయంలో తాజాగా ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి మంత్రి పదవి విషయంలో అనూహ్య ట్విస్టులు చోటు చేసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

మంత్రిగా రాములమ్మ..!
తెలంగాణ మంత్రివర్గంలోకి విజయశాంతి ఎంట్రీ ఖాయమేనా. ఢిల్లీలో విజయశాంతికి మంత్రి పదవి విషయంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ - బీజేపీని టార్గెట్ చేసేందుకు విజయశాంతి సరైన అస్త్రంగా కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్ లో చేరే సమయంలోనే నాడు పార్టీ ముఖ్య నేతలు రాములమ్మకు ఎమ్మెల్సీ పదవి పైన హామీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు ప్రభుత్వం - పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో విజయశాంతికి అనూహ్యంగా ఢిల్లీ స్థాయిలో నిర్ణయం మేరకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇక.. విజయశాంతికి మంత్రిగానూ అవకాశం ఇవ్వబోతున్నారని ప్రచారం సాగుతోంది. రాములమ్మకు మంత్రి పదవి పైన కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఆసక్తి కర చర్చ మొదలైంది.

ఒక మంత్రిని తప్పిస్తే
మంత్రివర్గ విస్తరణకు దాదాపు ముహూర్తం ఖరారైంది. ప్రస్తుతం కేబినెట్ లో ఒక మహిళా మంత్రి తన వ్యాఖ్యలతో వివాదాస్పదం అయ్యారు. కొంత కాలంగా మౌనంగానే ఉంటున్నారు. ఆ మంత్రి స్థానంలో విజయశాంతికి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే, అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం పని చేసిన వారికి.. ఇతర పార్టీల నేతలను చేర్చుకునే సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఈ సారి విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు సమయం లో అవకాశం ఇవ్వలేకపోయిన వారికి ఇప్పుడు ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అదే సమయం లో ప్రస్తుత మంత్రులు బాధ్యతలు చేపట్టి 17 నెలలే అవుతుండటంతో వారిని తెలిగిస్తే వ్యతిరేక సంకేతాలు వెళ్తాయనే చర్చ మొదలైంది.

Take a Poll

mlc-vijayasanthi-likely-to-induct-in-revanths-cabinet-as-latest-reports

హైకమాండ్ నిర్ణయం
ఒక మహిళా మంత్రితో పాటుగా మరో సీనియర్ ను పక్కన పెడతారనే చర్చ సాగుతోంది. ఆ ఇద్దరి ని తప్పిస్తే విజయశాంతికి రూట్ క్లియర్ అవుతుంది. అయితే, పార్టీలో ఉన్న వారిని కాదని.. ఎన్నిక ల సమయంలో వచ్చిన వారికి అవకాశం ఏంటనేది మరో వర్గం ప్రశ్నిస్తోంది. కాగా, ఎన్నికల సమ యంలో పార్టీలోకి వచ్చిన ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను ప్రభుత్వం ఏర్పాటు లోనే కీలక శాఖలు ఇచ్చిన అంశాన్ని మరి కొందరు గుర్తు చేస్తున్నారు. సీతక్కకు హోం శాఖ ఇవ్వటం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. వాకిటి శ్రీహరి, మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ అమీర్‌అలీఖాన్‌ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. మున్నూరు కాపు వర్గానికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వేళ విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వరంగల్ కోటాలో పరిశీలనలో ఉందని చెబుతు న్నారు. అయితే, ప్రస్తుత మంత్రులను తొలిగిచేందుకు రేవంత్ సుముఖంగా లేరని సమాచారం. దీంతో, విజయశాంతి కి మంత్రి పదవి విషయంలో రోజు రోజుకీ మారుతున్న లెక్కలతో తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+