మోడీ సర్కారుపై పోరు.. దక్షిణాది రాష్ట్రాలకు రేవంత్ పిలుపు

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాపలై వివక్ష చూపుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా మనకు రావాల్సిన హక్కులు సాధించుకునేందుకు పోరుడుదామని దక్షిణాది రాష్ట్రాలకు ఆయన పిలుపునిచ్చారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో పాల్గొన్న సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు.

వన్ నేషన్ వన్ ఎలక్షన్.. డీలిమిటేషన్ ఎజెండాతో మోడీ ముందుకు సాగుతున్నారన్నారు సీఎం రేవంత్. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. పార్లమెంట్ స్థానాలు తగ్గుతాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించడం వల్ల పార్లమెంట్ స్థానాలకు గండిపడే ప్రమాదం ఉందన్నారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు గళం విప్పాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అన్నారు.

Modi government is discriminating against southern states CM Revanth Reddy

తెలంగాణ రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతోందని, 1 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించిందన్నారు. దీంతో దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని సీఎం రేవంత్ వివరించారు. పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 25 వేల కోట్ల పెట్టుబడులే తెచ్చిందని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలల వ్యవధిలోనే 1.82 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిందని రేవంత్ వెల్లడించారు.

తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం రేవంత్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్నా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నగరాన్ని క్లీనెస్ట్, సేఫెస్ట్, సిటీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు మూడువేల ఈవీ బస్సులను కొనుగోలు చేశామన్నారు. అంతేగాక, గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో సంస్థలను ఆకర్షించగలిగామన్నారు.

ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మా రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టామని సీఎం రేవంత్ వివరించారు. యువతలో ఉన్న నైపుణ్యాలను బయటకు తెచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+