వెలుగులోకి వచ్చిన మంచు మనోజ్ వీడియో..!!
Manchu Vishnu: కుటుంబంలో ఆస్తి తగాదాలను ఎదుర్కొంటోన్నారు ప్రముఖ నటుడు మంచు మనోజ్. బైండోవర్ బారినా పడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సుధీర్ బాబుకు బైండోవర్‌ను సమర్పించాల్సి వచ్చింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే కారణంతో స్వయంగా వ్యక్తిగత విచారణకూ హాజరయ్యారు.
ఈ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదాయనకు. కుటుంబ వివాదాలకు పుల్ స్టాప్ పెడుతున్నానని, ఇక రెగ్యులర్‌గా తన కొత్త సినిమా భైరవం షూటింగ్‌లో పాల్గొంటానంటూ ఆయన ఇటీవలే వెల్లడించినప్పటికీ- వివాదాలు ఆయనను వదిలేలా లేవు.

కుటుంబంతో గొడవలు పడే సమయంలో జల్‌పల్లిలోని మంచు టౌన్ షిప్ వద్ద హల్‌చల్ చేసినప్పటి వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది. మంచు టౌన్ షిప్ ఆవరణలో వాగ్వివాదానికి దిగిన వీడియో అది. మోహన్ బాబు నచ్చజెప్పుతున్నప్పటికీ వినిపించుకోకుండా ముందుకు దూసుకెళ్లడం ఇందులో రికార్డయింది.
ఆ సమయంలో మనోజ్ మద్యం సేవించి ఉన్నట్లు చెబుతున్నారు. నువ్వెవడ్రా చెప్పడానికి మా ఇంటి కొచ్చి.. అంటూ ఎవరినో ఉద్దేశించి చెప్పడం ఇందులో కనిపించింది. మోహన్ బాబు సహా పక్కన ఉన్న వాళ్లు వెనక్కి లాగుతున్నప్పటికీ తూలుతూ ముందుకు వెళ్లడం ఇందులో చూడొచ్చు.
మంచు మనోజ్ తనను కొట్టాడంటూ మోహన్ బాబు ఇదివరకే మంచు మనోజ్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మనోజ్, కోడలు మౌనిక తనను కొట్టారంటూ రాచకొండ పోలీస్ కమిషనర్‌కు గతంలో ఫిర్యాదు చేశారాయన. మనోజ్ వల్ల తనతో పాటు భార్య ప్రాణాలకు ముప్పు ఉందని, ఈ నెల 8వ తేదీన తన ఇంటికి వచ్చిన మనోజ్ అనుచరులు అలజడి సృష్టించారని, భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు.
మంచు మనోజ్ మళ్ళీ దురుసు ప్రవర్తన. ఈ సారి సొంత వారితోనే!#ManchuManoj #MohanBabu #UANow pic.twitter.com/576HW4s62S
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) December 13, 2024
సోమవారం తెల్లవారు జామున కూడా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హల్‌చల్ చేశారని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు వివరించారు. ఉదయం 10: 30 గంటల సమయంలో మరోసారి మనోజ్ అనుచరులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇంట్లోకి జొరబడ్డారని, తనకు తన కుటుంబానికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications