తెలంగాణలోని ఈ జిల్లాలకు తీవ్రమైన ఎండల అలర్ట్

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక, రాగల నాలుగు రోజులపాటు ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

గత రెండు రోజుల నుంచి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. ఒక్కసారిగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే ఒక డిగ్రీ అధికంగా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే నాలుగు రోజులు ఉత్తర, దక్షిణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ప్రస్తుతం ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

More intense sun in northern Telangana districts for the next four days

పశ్చిమ జిల్లాల్లో 36 డిగ్రీల నుంచి 40 వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో సాధారణం కంటే ఒక డిగ్రీ అధికంగా నమోదవుతుందని పేర్కొంది. మార్చి నెలాఖరు నుంచి తెలంగాణలో వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇక, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండతీవ్రత ఎక్కువగానే ఉంటోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం అత్యధికంగా నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి, కట్టంగూర్ ప్రాంతాల్లో 41.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నల్గొండ జిల్లాలో 20 ప్రాంతాల్లో ఆరెంజ్‌ హెచ్చరిక స్థాయిలో 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో పది ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 3 ప్రాంతాలు, యాదాద్రి జిల్లాలో 13 ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న నాలుగు రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్న క్రమంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవసరం అయితే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటికి రావొద్దంటున్నారు. ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాత బయటికి వెళితే మంచిదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+