video:బిడ్డ..మత్తు వదలరా..? 15 ఏళ్ల కొడుకు కంట్లో కారం కొట్టిన తల్లి, ఎక్కడంటే...?
నిన్నటి నుంచి డ్రగ్స్ కేసు గురించే చర్చ.. ఎక్కడ చూసిన దానిపై డిస్కషన్. బంజారాహిల్స్ పబ్ డ్రగ్ కేసుతో మొత్తం మత్తు మీద వార్తలు కేంద్రీకృతం అవుతున్నాయి. అయితే మైనర్లు కూడా మత్తులో జోగుతున్నారు. దీంతో పేరంట్స్ మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. మొక్కలోనే తుంచివేయాలనే కారణంతో.. ఇలా చేయక తప్పడం లేదు. ఎందుకంటే.. డ్రగ్స్ తీసుకుంటే.. మారడం కష్టం. జీవితాలే నాశనం అవుతాయి. ఇదీ తెలియని కొందరు.. మైకం కోసం డ్రగ్స్ తీసుకొని.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

15 ఏళ్ల కుర్రాడు..
సూర్యాపేట జిల్లా కోదాడలో 15 ఏళ్ళ వయసులో మైనర్ గంజాయికి బానిసయ్యాడు. తీరు మార్చుకోవాలని తల్లి హెచ్చరించింది. అయినా కొడుకు పద్ధతిలో ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో ఆ తల్లికి చిరాకు వచ్చింది. అతడిని స్తంభానికి కట్టేసింది. కంట్లో కారం చల్లి.. చితకొట్టింది.
కుమారుడు చెబితే వినడం లేదని.. ఇదీ తప్ప తనకు మరో మార్గం కనిపించలేదని అంటోంది. అతని భవిష్యత్ గురించే ఆలోచిస్తున్నానని తెలిపింది. కానీ ఇలా మత్తులో జోగితే ఎలా అని అంటోంది. మత్తు పదార్దాల విక్రయాలపై అధికారులు ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.

డ్రగ్స్ ఎలా వచ్చాయి..
ఇక నిన్న బంజారాహిల్స్ పబ్ డ్రగ్ కేసు కలకలం రేపింది. 142 మంది పేరుతో పోలీసులు జాబితా కూడా విడుదల చేశారు. దీనిపై విచారణ కూడా జరుపుతున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడిది..? మీకు ఎవరూ సరఫరా చేశారు..? అన్న దానిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూపీ లాగుతున్నారు.
నలుగురిని అరెస్ట్ చేసిన అనంతరం వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అరెస్టైన వారిలో పబ్ నిర్వాహకుడు అభిషేక్, ఈవెంట్ మేనేజర్ అనిల్ ఉన్నారు. ఈ కేసులో మరింత పురోగతి సాధించేందుకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఏసీపీ నర్సింగ్ రావు, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనాథ్ రంగంలోకి దిగి కేసు విచారణ చేస్తున్నారు.
తప్పని వేటు
డ్రగ్స్ ఘటన కలకలం రేపిన వెంటనే బంజారాహిల్స్ సీఐ శివచంద్రను... సీపీ సీవీ ఆనంద్ సస్పెండ్ చేయగా, ఏసీపీకి మెమో జారీ చేశారు. కొత్త సీఐగా నాగేశ్వర్‌రావును నియమించారు. గత ఆరేళ్లలో టాస్క్‌ఫోర్స్‌లో నాగేశ్వర్‌రావు కీలక పాత్ర పోషించారు. పలు డ్రగ్స్ రాకెట్లను బట్టబయలు చేశారు. అందుకే అతనికి బాధ్యతలు అప్పగించారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications