మోత్కుపల్లి భావోద్వేగం: 'సిద్ధంగా లేం', టీఆర్ఎస్‌పై బర్రె సామెత
హైదరాబాద్: మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవనలో తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఆవిర్భావ వేడుకలకు హాజరైన తెలంగాణ సీనియర్ మోత్కుపల్లి నరసింహులు భావోద్వేగంతో మాట్లాడారు.
తెలంగాణలో మేం అభద్రతకు లోనవుతున్నామని తెలిపారు. మిమ్మల్ని(చంద్రబాబు నాయుడు) వదిలిపెట్టేందుకు మేం సిద్ధంగా లేమని ఆయన పేర్కొన్నారు. 27 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేలమయ్యామని, ఆ తర్వాత మంత్రులం కూడా అయ్యామని చెప్పుకొచ్చారు.
పసుపు జెండా కప్పుకొని సచ్చిపోవడానికి అవకాశం ఇవ్వండని కాస్తంత ఉద్వేగంతో మాట్లాడారు. సచ్చేవరకూ పసుపు జెండాతోనే ఉంటామని, కానీ మేం వేరోకచోటికి పోకుండా కాపాడాల్సిన బాధ్యత పార్టీ అధినేతపైనే ఉందని చంద్రబాబుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కాస్తంత శ్రమైనా ఆ బాధ్యత ఆయన తీసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పనిలో పని టీఆర్ఎస్‌పై కూడా విమర్శలు చేశారు. 'ఇంటికి కొత్త బర్రె వస్తే ఇంట్లో వాళ్లంతా కలిసి పెంట తీశారని సామెత. టీఆర్ఎస్ పార్టీలో కూడా ఇలాగే ఉంది. ఆ పార్టీపై మోజు ఎక్కువ కాలం ఉండదు' అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 14 ఏళ్లుగా పార్టీని నడుపుతున్నా సొంత నేతలను తయారు చేసుకోలేకపోయారని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలను దిగుమతి చేసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications