నాన్నా నువ్వు నాతోనే ఉంటావు: డీఎస్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ భావోద్వేగ పోస్ట్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు.

డీఎస్ మరణం పట్ల ధర్మపురి అరవింద్ ట్వీట్
తన తండ్రి మరణం తర్వాత ధర్మపురి అరవింద్ చేసిన ట్వీట్ లో అన్నా అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇకలేరు. ఐ విల్ మిస్ యు డాడీ.. నా తండ్రి నా గురువు అన్ని మా నాన్నే.. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే అంటూ ఎమోషనల్ అయ్యారు.

MP Dharmapuri Arvind emotional post on his father Dharmapuri srinivas who passed away

తండ్రిపై తనయుడు భావోద్వేగ పోస్ట్, హరీష్ రావు సంతాపం
నాన్నా ... నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నాలోనే ఉంటావు అంటూ భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు ధర్మపురి అరవింద్.కాగా ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్, యాదవ్ వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎంపీగా డిఎస్ సుదీర్ఘకాలం సేవలందించారని వారన్నారు. ధర్మపురి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

డీఎస్ మరణం పట్ల బాధ వ్యక్తం చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్
డీఎస్ మరణం పట్ల బాధను వ్యక్తం చేశారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన కిందిస్థాయి నుంచి అంచలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో డిఎస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. డిఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నిజామాబాద్ కు డీఎస్ పార్ధివ దేహం.. రేపు అంత్యక్రియలు
ప్రస్తుతం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నివాసంలో ఉన్న డిఎస్ భౌతికకాయాన్ని మధ్యాహ్నం నిజామాబాద్ కు తరలించనున్నారు. ఆదివారం ఉదయం నిజామాబాద్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక లాంచనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+