మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన బీజేపీ .. ఆమన్ గల్ లో కమల వికాసం
రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల బలాబలాలు తెలియజేసే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి . ఉత్కంఠ భరితంగా సాగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ల్లో అధికార టీఆర్‌ఎస్ దూసుకుపోతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కొన్ని వార్డుల్లో విజయం సాధించినప్పటికీ.. అనుకున్న స్థాయిలో రాణించలేదని తెలుస్తోంది. ఇక బీజేపీ కూడా అక్కడక్కడా తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది .
ఇక ఆమన్ గల్ మున్సిపాలిటీలో కమలం వికసించింది. కాంగ్రెస్, బీజేపీ బోణీతో ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం 15 వార్డుల్లో బీజేపీ 7 స్థానాల్లో స్వతంత్రులు ఒక్క స్థానంలో గెలిచారు. మిగతా స్థానాల్లోనూ బీజేపీ లీడ్ లో ఉంది. ఇక టీఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. ఇక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన భైంసాలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.ఆర్మూర్ మున్సిపాలిటీలో 7 వార్డుల్లో బీజేపీ గెలుపొందింది.

మరోవైపు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఆరు వార్డుల్లో , వేములవాడలో 7 స్థానాల్లో , కోరుట్లలో 5 స్థానాల్లో ఇప్పటివరకు బీజేపీ విజయం సాధించింది. మరికొన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పలు వార్డుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications