తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్.. రేపటి నుంచే నామినేషన్స్

తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. కాగా ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జనవరి 28వ తేదీ (బుధవారం) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను జనవరి 30వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు దాఖలు చేయవచ్చు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన చేపట్టి, అదే రోజు సాయంత్రం అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం తుది బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. చివరిగా ఫిబ్రవరి 11న పోలింగ్‌ జరగనుంది.. ఓటింగ్ పూర్తి అయిన వెంటనే లెక్కింపు ప్రారంభించి తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు.

municipal-elections-notification-in-telangana-released-by-election-commission-and-full-schedule-deta

ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఇక ఇటీవలే ముగిసిన పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో రాజకీయాలను యాక్టివ్ చేశాయి. హోరాహోరీగా సాగిన సర్పంచ్ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు పొందిన అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయం సాధించి తొలి స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు రెండో స్థానాన్ని దక్కించుకోగా.. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా ఇప్పుడు రాష్ట్రంలో మరో కీలక ఎన్నికలకు రంగం సిద్దమవుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యమైన తేదీలు ఇవే..

నామినేషన్ల ప్రారంభం: 28.01.2026 (ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు).
నామినేషన్ల ముగింపు: 30.01.2026 (సాయంత్రం 5:00 గంటల వరకు).
పోలింగ్ తేదీ: 11.02.2026 (ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు).
ఓట్ల లెక్కింపు: 13.02.2026 (ఉదయం 8:00 గంటల నుంచి).
ఫలితాల ప్రకటన: ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+