మునుగోడు ఉపఎన్నిక మోసగాళ్లు మెగా మోసగాళ్ళకు మధ్య పోటీ: కేసీఆర్‌పై వైఎస్ షర్మిల సెటైర్లు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ధర్మపురి లో పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మునుగోడు ఉపఎన్నికను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల కు షర్మిల కౌంటర్ ఇచ్చారు.

మునుగోడు ఉపఎన్నిక మోసగాళ్ళకు మెగా మోసగాళ్ళకు మధ్య పోటీ
మునుగోడు ఉపఎన్నిక మోసగాళ్లకు, మొనగాళ్ళకు మధ్య జరుగుతున్న పోటీ అని సీఎం కేసీఆర్ చెబుతున్నారని పేర్కొన్న వైయస్ షర్మిల టిఆర్ఎస్ పార్టీ నాయకులు మొనగాళ్లు ఎలా అవుతారని ప్రశ్నించారు. బిజెపి నాయకులు మోసగాళ్లు అయితే.. మరి మీరు ఏమిటి అంటూ నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని మీరు మెగా మోసగాళ్ళు కాదా అని వైయస్ షర్మిల ప్రశ్నించారు.
తెలంగాణా ప్రజల హామీలు నెరవేర్చని కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు 420లు
తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చేయలేదని, మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, రుణమాఫీ చేస్తానని చేయలేదని, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పి ఇవ్వలేదని సీఎం కెసిఆర్ మోసం చేస్తారని పేర్కొన్న వైయస్ షర్మిల, ఇన్ని మోసాలు చేసినా మీరు మెగా మోసగాళ్ళు కాకపోతే ఇంకేమిటి అంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను నిండా ముంచిన కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 420లు, మెగా మోసగాళ్లు అంటూ వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు.

ప్రాజెక్టుల పేర్లతో వేల కోట్ల కమీషన్లు
డబ్బులు సంపాదించుకోవడం, రాజకీయాలు చేయడంపైనే కేసీఆర్ దృష్టి పెట్టారని వైయస్ షర్మిల విమర్శించారు. ప్రాజెక్టుల పేర్లతో వేల కోట్ల కమీషన్లు దోచుకున్నాడని వైయస్ షర్మిల తిట్టిపోశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా అవినీతి ఉందని వైయస్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఉచిత విద్య,వైద్యం దిక్కులేకుండా పోయిందని, దళితబంధు 'అనుచరుల బంధు' అయిందని వైయస్ షర్మిల పేర్కొన్నారు.ధరణిని తీసుకొచ్చి వేల ఎకరాల భూములు కొల్లగొట్టాడు కెసిఆర్ అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికలు అయిపోయాక ఐదేండ్లు ఫామ్ హౌజ్ లోనే కేసీఆర్
ఎన్నికలొస్తేనే సారు బయటకు వస్తాడు అని పేర్కొన్న షర్మిల ఎన్నికలు అయిపోయాక ఐదేండ్లు ఫామ్ హౌజ్ లోనే ఉంటాడు అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటూ.. విమానాలు కొంటూ.. దేశ దోపిడీకి వెళ్తున్నాడు కెసిఆర్ అంటూ వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. వైయస్సార్ తెలంగాణ పార్టీని ఆశీర్వదిస్తే వైయస్ఆర్ సంక్షేమ పాలన ప్రతి గడపకూ అందుతుందని ఆమె హామీ ఇచ్చారు
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications