అలా చెప్పే దమ్ముందా రాజగోపాల్? మునుగోడులో కోమటిరెడ్డిపై మళ్ళీ పోస్టర్ల కలకలం!!
మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార పర్వం జోరుగా సాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. అయితే మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం మొదటి నుండి ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేసి నిప్పులు చెరుగుతున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి వ్యతిరేకంగా వెలుస్తున్న పోస్టర్లు ఆయనను మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.

మునుగోడు లో రాజగోపాల్ రెడ్డి టార్గెట్ గా పోస్టర్ల కలకలం
మునుగోడు ఉపఎన్నిక ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై అనేకమార్లు పోస్టర్లు వెలిశాయి. కాంట్రాక్టు పే అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టులకు అమ్ముడుపోయారని, 18 వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకుని బీజేపీలో చేరారని పోస్టర్లు ఇంతకుముందే కలకలం సృష్టించాయి. ఆ తర్వాత దుబ్బాక, హుజురాబాద్ ఓటర్ ల పేరుతో బిజెపికి ఓటు వేసి మేము మోసపోయాం మీరు కూడా మోసపోకండి అంటూ పోస్టర్లు సంచలనంగా మారాయి. ఇక ఇప్పుడు మళ్లీ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి కి వ్యతిరేకంగా పట్టణమంతా పోస్టర్లు కలకలం గా మారాయి.

బిజెపి పాలిత రాష్ట్రాలలో తెలంగాణ వలే పించన్లు ఇస్తున్నారా?
మునుగోడు నియోజకవర్గం లోని చండూరు పట్టణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లలో ఈసారి రాజగోపాల్ రెడ్డి ని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ ల కంటే ఏ రాష్ట్రమైనా ఎక్కువ ఇస్తుందా .. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి చెప్పే దమ్ము ఉందా అని సవాల్ చేస్తూ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా, ఒంటరి మహిళ పెన్షన్ 2016 రూపాయలు, దివ్యాంగుల పెన్షన్ 3016 రూపాయలు అందిస్తుందని, ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, ఉత్తర ప్రదేశ్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్ లో ఇలా పెన్షన్లను ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల పెన్షన్లు తెలంగాణ రాష్ట్ర పెన్షన్ తో పోల్చి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ ల కంటే ఎక్కువ ఏ ఒక్క బీజేపీ రాష్ట్రమైనా ఇస్తుందని చెప్పే దమ్ముందా రాజగోపాల్ రెడ్డి అంటూ పోస్టర్లు వేశారు.

రాజగోపాల్ రెడ్డి అనుకూల పోస్టర్లతో రివర్స్ ఎటాక్ చేస్తున్న బిజెపి
రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్న ప్రత్యర్థి పార్టీలు పోస్టర్లు వేసి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉండడంతో, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్ మండలాలలో రాజగోపాల్ రెడ్డి అనుచరులు ఆయన అనుకూల పోస్టర్లతో రివర్స్ ఎటాక్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్లే మునుగోడు ప్రజల కలలు నెరవేరుతున్నాయని, ప్రతి గ్రామానికి 20 లక్షల రూపాయల నిధులు వచ్చాయని, అది రాజన్న రాజీనామా తోనే సాధ్యమైందని పోస్టర్లు వేశారు. ఏది ఏమైనా మునుగోడులో పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని పోస్టర్లతో టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications