వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడులో కాంగ్రెస్ కు షాక్.. పాల్వాయి స్రవంతిపై మార్ఫింగ్ ఫోటోలతో; బీజేపీపై భగ్గుమన్న రేవంత్‌రెడ్డి!!

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉపఎన్నికలో కీలకమైన పోలింగ్ రోజున కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా మార్ఫింగ్ చేసిన ఫోటోలతో పాల్వాయి స్రవంతిని టార్గెట్ చేస్తున్నారు. ఇక ఈ ప్రచారం మునుగోడులో ఉప ఎన్నికల పోలింగ్ పై పడుతుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పాల్వాయి స్రవంతిపై దుష్ప్రచారం.. స్పందించిన స్రవంతి, రేవంత్ రెడ్డి

పాల్వాయి స్రవంతిపై దుష్ప్రచారం.. స్పందించిన స్రవంతి, రేవంత్ రెడ్డి

అయితే ఈ ప్రచారం పై స్పందించిన పాల్వాయి స్రవంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తానూ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పని చేస్తున్నానని స్పష్టం చేశారు. ఓటర్లను గందరగోళానికి గురి చేసి ఓట్లు పడకుండా చెయ్యాలనే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.
కాగా పాల్వాయి స్రవంతి పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు.

ఫేక్ పార్టీ బీజేపీ దుష్ప్రచారం అంటూ భగ్గ్గుమన్న రేవంత్ రెడ్డి

ఫేక్ పార్టీ బీజేపీ దుష్ప్రచారం అంటూ భగ్గ్గుమన్న రేవంత్ రెడ్డి


దుబ్బాక తరహాలోనే మునుగోడులో ఫేక్ పార్టీ అయిన బిజెపి సోషల్ మీడియాలో బరితెగించిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతి పై మార్పింగ్ ఫోటోలతో దుష్ఫ్రచారం బిజెపి నాయకులు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓటమి ఖాయం అన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారు అంటూ రేవంత్ రెడ్డి భగ్గుమన్నారు.

 మునుగోడులో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనలు

మునుగోడులో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనలు

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. అక్కడక్కడ చిన్న అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చండూరులో, మర్రిగూడ లో బిజెపి, టిఆర్ఎస్ శ్రేణులు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధాన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.

 పాల్వాయి స్రవంతిపై ప్రచారంతో కాంగ్రెస్ లో ఆందోళన

పాల్వాయి స్రవంతిపై ప్రచారంతో కాంగ్రెస్ లో ఆందోళన

ఇదిలా ఉంటే మునుగోడు పోలింగ్ బూత్ వద్ద కు టిఆర్ఎస్ నాయకులు పార్టీ కండువాలు జెండాలతో వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. ఇక మునుగోడు పోలింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తలనొప్పిగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓట్లు పడకుండా సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతోందని పార్టీ శ్రేణులలో ఆందోళన వ్యక్తమవుతోంది.

English summary
munugode polling time there is a propaganda on plavai sravanthi with morphed photos as she met KCR. Responding to this, Palvai Sravanti said that she would file a complaint with the EC, while Revanth Reddy targeted the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X