హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంచుల్లో మహిళ శవం ముక్కలు: వీడని మిస్టరీ, ఎవరో చెప్తే లక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల జరిగిన గర్భవతి హత్య మిస్టరీ వీడలేదు. హైదరాబాదులోని బొటానికల్ గార్డెన్ వద్ద లభించిన మహిళ మృతదేహం ఎవరిదనేది తేలడం లేదు. దాంతో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.

Recommended Video

8 నెలల గర్భిణి ని ముక్కలుగా నరికి.... నార్త్ ఇండియన్ అన్న కోణంలో

మృతురాలి ఆనవాళ్ల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు వాటి ఆధారంగా ఎవరైనా సమాచారం ఇస్తే, ఆ మహిళ ఎవరనేది చెప్తే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. అన్ని ఆధారాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.

సీసీటీవి ఫుటేజీల పరిశీలన

సీసీటీవి ఫుటేజీల పరిశీలన

హైదరాబాదులోని గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్‌కు వచ్చే ప్రధాన రహదారిలోని, కొండాపూర్ ప్రాంతాల్లోని సిసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహం వద్ద మహిల గాజులు, దుస్తులు లభించాయి. వాటి ఆధారంగా వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా, మృతదేహం ముక్కలను ఉంచి సంచుల ఆధారంగా కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

దారుణంగా కొట్టారు..

దారుణంగా కొట్టారు..


మహిళను మృతికి ముందు తీవ్రంగా కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికను బట్టి తెలుస్తోంది. తీవ్రంగా కొట్టడం వల్ల మహిళ పక్కటెముకలు విరిగాయని, గర్భంలోని మగశిశువు కూడా ముక్కలు ముక్కలైనట్లు గుర్తించారు. ఇంత దారుణంగా ఆమెను హత్య చేయడానికి ఉన్న బలమైన కారణాలేమిటనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు.

స్థానిక మహిళ కాకపోవచ్చునని...

స్థానిక మహిళ కాకపోవచ్చునని...


మృతురాలి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. సంచిలో మహిళ దుస్తులు, రింగులు, గాజులు లభించాయి. వాటితో పాటు ఆమె వస్త్రధారణ చేతి రింగులు, చెవి దిద్దులను బట్టి ఆమె ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఆస్పత్రుల్లో ఆరా తీశారు..

ఆస్పత్రుల్లో ఆరా తీశారు..

నగరంలోని ఏదైనా ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఉండవచ్చునని కూడా పోలీసులు ఆరా తీశారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని, నగరంలోని అన్ని పోలీసు స్టేషన్లకు ఆనవాళ్లతో పోస్టర్ పంపంచారు. కొండాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో లభించిన ఆధారాలతో ఫొటోలు తీసి స్థానికులనుంచి సమాచారం రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఐటి కారిడార్‌లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా ఆరా తీస్తున్నారు.

మూడు వాహనాలు ఇలా...

మూడు వాహనాలు ఇలా...

మంగళవారం వేకువజామున మహిళ మృతదేహం లభించిన ప్రాంతంలో మూడు వాహనాలు మూడు రడ్లు వేసినట్లు సిసికెమెరాల ఫుటేజీల్లో రికార్డయింది. అయితే, మృతురాలు ఎవరనేది తెలిస్తేనే దర్యాప్తు ముందుకు సాగుతుందని అంటున్నారు. మృతి చెందిన మహిళ ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు ఉంటుంది. దాదాపు 30 ఏళ్ల వయస్సు ఉంటుంది. గుండ్రని ముఖం, తలుగు రంగు శరీరం. మెరూన్ రంగు కుర్తా, ఎరుపు రంగు పైజామా, వెండి, రాగి ఉంగరాలు, మెరూన్ రంగు చేతిగాజులు ఉన్నాయి.

సంచులపై ఇలా...

సంచులపై ఇలా...


మృతదేహం ముక్కలు కట్టిన సంచులు మధ్యప్రదేశ్ ఇండోరుకు చెందిన 24 క్యారెట్ స్పై సే, మహారాష్ట్రలోని లాతూరు జిల్లా ఔసాలోని అర్చన మిల్స్ నుంచి గోధుమ పండి, గుంటూరులోని అంకూర్ మిర్చికి చెందినవని తేలింది.రెస్టారెంట్లకు, కిరాణా దుకాణాలకు, సూపర్ మార్కెట్లకు ఎగుమతులు చేయడానికి వాడిన సంచులు కావచ్చనని అనుమానిస్తున్నారు.

English summary
Pregnant woman murder case is not yet solved. Woman dead body has found at Botanical garden at Gachiboli in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X