33 ఏళ్ళ తర్వాత ఇంటికి, రాజకీయాల్లో చేరే విషయమై త్వరలోనే స్పష్టత: జంపన్న

Posted By:
Subscribe to Oneindia Telugu

వరంగల్:రాజకీయాలపై విముఖత లేదని, ఈ కారణంగా రాజకీయాలపై అంత ఇష్టం కూడ లేదని మాజీ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు జంపన్న అలియాస్ జినుగు నర్సింహ్మరెడ్డి చెప్పారు. ప్రజల కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని ఆయన చెప్పారు.

  పోలీసుల ఎదుట లొంగిన మావోయిస్టు లీడర్.. తల్లిని చూసి భావోద్వేగ సంభాషణ !

  రెండు రోజలు క్రితం తెలంగాణ పోలీసుల ఎదుట మాజీ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు జినుగు నర్సింహ్మరెడ్డి అలియాస్ జంపన్న లొంగిపోయారు.మావోయిస్టు పార్టీ నాయకత్వంతో సైద్దాంతిక విబేధాల కారణంగానే లొంగిపోయినట్టు పోలీసుల సమక్షంలో ఆయన ప్రకటించారు.

  అదే రోజు వరంగల్‌లోని వృద్దాశ్రమంలో ఉంటున్న తన తల్లితో ఆయన కొద్దిసేపు గడిపారు.మంగళవారం నాడు జంపన్న తన స్వగ్రామానికి వెళ్ళారు.సాయంత్రం వరకు తన స్నేహితులు, గ్రామస్థులతో గడిపారు.గ్రామస్థులు జంపన్న దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు.

  రాజకీయాల్లో చేరే విషయమై త్వరలోనే స్పష్టత ఇస్తా

  రాజకీయాల్లో చేరే విషయమై త్వరలోనే స్పష్టత ఇస్తా

  రాజకీయాల్లో చేరే విషయమై తాను త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్టు మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న చెప్పారు. రాజకీయాలపై విముఖత ఏమీ లేదని, అలాగని ఇష్టం కూడా లేదన్నారు. రాజకీయాల్లో చేరే విషయమై త్వరలోనే సమాధానం ఇవ్వనున్నట్టు జంపన్న చెప్పారు.

  ప్రజలకే జీవితం అంకితం

  ప్రజలకే జీవితం అంకితం

  ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేశానని జంపన్న చెప్పారు. తన తల్లిని, తండ్రిని చూసేందుకు రాలేకపోయాయని చెప్పారు. ఉద్యమ జీవితంలో తల్లిదండ్రులను చూసేందుకు రాలేకపోయాయని చెప్పారు. ప్రజల కోసమే తాను ఇంత కాలం పాటు అడవుల్లో గడపాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు.

  జంపన్న దంపతులకు ఘన స్వాగతం

  జంపన్న దంపతులకు ఘన స్వాగతం

  జంపన్న దంపతులకు గ్రామంలో ఘనంగా స్వాగం పలికారు.10వ, తరగతి పూర్తైన తర్వాత జంపన్న గ్రామాన్ని వదిలి వెళ్ళారు. హైద్రాబాద్ మల్లేపల్లిలో ఐటిఐ చదవే సమయంలో పీపల్స్‌వార్‌లో చేరారు.తొర్రూరు మండలంలోని చర్లపాలెం గ్రామానికి జంపన్న 33 ఏళ్ళ తర్వాత వచ్చారు.

  ఉద్విగ్నతకు గురైన బాబాయ్

  ఉద్విగ్నతకు గురైన బాబాయ్

  గ్రామంలోకి రాగానే జంపన్న బాబాయ్ మోహన్ రెడ్డి జంపన్నను ఆప్యాయంగా కౌగిలించుకొని బావోద్వేగానికి గురయ్యారు. ఎలా ఉన్నావు బిడ్డా అంటూ పలకరించారు. గ్రామంలోని బంధువులను జంపన్న పేరు పేరున పలకరించారు.

  స్నేహితులు.బంధువులతో సరదాగా

  స్నేహితులు.బంధువులతో సరదాగా

  స్నేహితులు, బంధువులతో సరదాగా సాయంత్రం వరకు జంపన్న గడిపారు. తాను చదువుకొన్న స్కూల్లో పాత విషయాలను జంపన్న గుర్తు చేసుకొన్నారు. స్నేహితులతో ఆనాటి సంగతులను నెమరేసుకొన్నారు.బంధువులతో కలిసి భోజనం చేశారు. తాను పుట్టిన ఇంటిని పరిశీలించారు.కన్నతల్లిని, పుట్టిన ఊరిని ఏనాడూ చూస్తానని అనుకోలేదన్నారు జంపన్న.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  After working with the Maoist party for over three decades, 55-year-old Jampanna claims to be a man disillusioned of the party’s ideology. With no regrets over his past, the renegade Maoist leader says he will fight for people’s problems in a democratic manner now.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి