అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన హైదరాబాద్ యువతి.. 27 ఏళ్లకే సెనేటర్ గా..

అమెరికాలో జరిగిన మిడ్ టర్మ్ ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ ఘనవిజయం సాధించింది. యూఎస్ కాంగ్రెస్‌ లోని ఉభయసభలతో పాటు పలు కీలక రాష్ట్రాల గవర్నర్ పదవులను డెమొక్రాట్లు కైవసం చేసుకున్నారు. మరోవైపు అమెరికాలోని ఇల్లినాయిస్ స్టేట్ సెనేట్ లో హైదరాబాద్ యువతి ఘన విజయం సాధించి సంచలనంగా మారారు. హైదరాబాద్ మూలాలు ఉన్న 27 ఏళ్ల యువతి నబీలా సయ్యద్.. ఇల్లినాయిస్ స్టేట్ సెనేట్ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు. డెమోక్రాటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె తోటి ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత సెనేట్ అయిన డార్బి హిల్స్ ను ఓడించారు.

హైదరాబాద్ మూలాలు ఉన్న నబీలా తల్లిదండ్రులు 1980 లో అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. ఇక అక్కడే పుట్టిన నబీలా సయ్యద్.. 2022 లో తొలిసారిగా ఇల్లినాయిస్ హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్ గా గెలుపొందారు. అంతకుముందే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కాలేజీ విద్యను పూర్తి చేసిన ఆమె 2024 లో మరోసారి ఇల్లినాయిస్ హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్ గా విజయం సాధించారు. ఈ క్రమంలో అతి చిన్న వయసులోనే ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీకి ఎన్నికైన యువతిగా ఆమె నిలిచారు. అలాగే ఈ ఘనత సాధించిన ఏకైక ముస్లిం యువతిగా రికార్డు నెలకొల్పారు. అయితే ఇప్పుడు ఏకంగా ఇల్లినాయిస్ స్టేట్ సెనేట్ గా భారీ విజయం సాధించారు నబీలా సయ్యద్.

ఇక గతంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించినప్పుడు తాను క్లాస్ రూమ్ లో కూర్చుని ఏడ్చానని ఎన్బీసీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేశారు. మా లాంటి వాళ్లకు ఈ దేశంలో చోటు లేదని అనుకున్నాను. నేను ఈ ప్రాంతానికి చెందినదాన్నా.. అన్న అనుమానం వచ్చింది. కానీ నాకు తెలిసిన ఇల్లు ఇదొక్కటే.. ఏదేమైనా నా ప్రాంతం ఇదేనని అనుకున్నానని స్పష్టం చేశారు. అయితే ఇప్పడు ఆమె అనుకున్నట్లుగానే సెనేట్ గా విజయం సాధించిన నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

NabilaSyed young woman from Hyderabad won the election for the Illinois State Senate United States

మరోవైపు అగ్రరాజ్యంలో అమెరికాలో హైదరాబాద్ మూలాలున్న ఓ యువతి విజయం సాధించడం.. భారత్ కు అలాగే హైదరాబాద్ వాసులకు గర్వకారణం అని నెటిజన్లు సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుకుంటున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో భారతీయ సంతతి కలిగిన అమీ బెరా, పయా దాందియా, అబ్దుల్ ఎల్ సయ్యద్, ఆడమ్ హమావీ తదితరులు కూడా విజయం సాధించినట్లు కథనాలు వెల్లడవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+