కాంగ్రెస్ పార్టీకి రెబల్‌గా మారిన నాగం జనార్ధన్ రెడ్డి: రేవంత్‌పై ఫైర్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అభ్యర్థుల ప్రకటనలు వెలువడుతున్న క్రమంలో అన్ని పార్టీల నుంచి అసంతృప్త నేతలు.. ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మరికొంత మంది మాత్రం స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

తాజాగా, తెలంగాణ మాజీ మంత్రి, సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి కూడా తనకు టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ, అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయాలని, తనకే టికెట్ వస్తుందని ఆశించిన నాగం జనార్ధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. ఆయనకు టికెట్ కేటాయించలేదు. దీంతో నాగం తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

Nagam Janardhan Reddy hits out at Congress party and Revanth Reddy for not giving ticket to him

ఈ క్రమంలో నాగం మరో నేత చింతలపల్లి జగదీశ్వర్ రావు ఆధ్వర్యంలో సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో అసమ్మతి నేతలు, కార్యకర్తలు సమావేశమయ్యారు. అవకాశవాది జూపల్లి కృష్ణారావు గెలిచిన తర్వాత పార్టీ మారరా? అని నాగం ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాతే వచ్చారని, కోవర్ట్ రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి జరిగిన అన్యాయానికి రేవంత్ రెడ్డిదే బాధ్యత అని స్పష్టం చేశారు.

పార్టీలో అన్యాయం జరిగిన నాయకులకు అండగా నిలిచి, కలిసి పోరాడుతామన్నారు. సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, బీసీలను రేవంత్ రెడ్డి అవమానించారని నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని నాగం జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మరో కాంగ్రెస్ నేత చింతలపల్లి జగదీశ్వర్ రావు మాట్లాడుతూ.. తనను రేవంత్ రెడ్డి మోసగించారని ఆరోపించారు. కొల్లాపూర్ నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానని చెప్పారు. జూపల్లిని ఓడించి బుద్ధి చెబుతామని అన్నారు.

జనగామ టికెట్ దక్కకపోవడంతో 45 ఏళ్లపాటు పార్టీలో పనిచేసిన తనను అవమానించారంటూ మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేగాక, సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+