మంత్రి పిలుపు: అమలతో కలిసి నాగార్జున స్పందన, కేటీఆర్ థ్యాంక్స్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్‌కు నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. నేను చేనేత దుస్తులు ధరిస్తున్నాను, మరి మీ మాటేమిటి అని కేటీఆర్ నాలుగు రోజుల క్రితం ట్వీట్ చేసారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్‌కు నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. నేను చేనేత దుస్తులు ధరిస్తున్నాను, మరి మీ మాటేమిటి అని కేటీఆర్ నాలుగు రోజుల క్రితం ట్వీట్ చేసారు.

దీనిపై నాగార్జున స్పందించారు. తాను, తన సతీమణి అమల చేనేత వస్త్రాలు ధరించి ఉన్న ఫొటోను యువ సామ్రాట్ ట్వీట్‌ చేశారు. చేనేత వస్త్రాలు చాలా నచ్చాయని, ఇవి అందంగా ఉండటమే కాదు, సౌకర్యవంతంగానూ ఉన్నాయని పేర్కొన్నారు.

చేనేత రంగానికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నానని, ఇదిగో నేను, అమల చేనేత వస్త్రాలు ధరించిన ఫోటో అంటూ.. కేటీఆర్‌కు బదులు ఇచ్చారు. దీనిపై వెంటనే కేటీఆర్ స్పందించారు. నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, ఇది చాలామందికి స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నానని ట్వీట్ చేశారు.

Nagarjuna tweets with Handlloms pic to Minister KTR

కాగా, తాను చేనేత వస్త్రాలు ధరిస్తున్నానని, మరి మీ మాటేమిటని.. ప్రముఖులను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ఆహ్వానం పలికారు. ప్రతి సోమవారం నాడు చేనేత దుస్తుల్లోనే తాను విధులకు హాజరవుతానని మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు.

చెప్పిన మాట మీద ఆయన నిలబడ్డారు. అందులో భాగంగా గత సోమవారం చేనేత దుస్తులు ధరించి కార్యాలయానికి వచ్చారు. కేటీఆర్‌తో పాటు ఆయన కార్యాలయ సిబ్బంది, అధికారులు కూడా చేనేత దుస్తుల్లో వచ్చారు. చేనేతకు చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, మంగళవారం నాడు ప్రముఖులకు చేనేత దుస్తులు ధరించాలని ఆహ్వానం పలికారు.

కేటీఆర్‌తో పాటు ఆయన కార్యాలయ సిబ్బంది, అధికారులు కూడా చేనేత దుస్తుల్లో వచ్చారు. చేనేతకు చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, మంగళవారం నాడు ప్రముఖులకు చేనేత దుస్తులు ధరించాలని ఆహ్వానం పలికారు.

అదే సమయంలో విలక్షన నటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ మహేష్ బాబు, టెన్నిస్ తార సానియా మీర్జా, రాజ్‌దీప్ సర్దేశాయ్, వివేక్ ఒబెరాయ్, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, పీవీ సింధు, నటి సమంత తదితరులను ఆహ్వానించారు. మీరు చేనేత వస్త్రాలు ధరించాలని అభిప్రాయపడ్డారు. దానికి కమల్ హాసన్ వెంటనే స్పందించారు. ఇప్పుడు నాగార్జున స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+