Nalgonda election war: నల్గొండలో నువ్వా నేనా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నెగ్గేనా!!

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. రాజకీయ చైతన్యానికి మారుపేరైన నల్లగొండ జిల్లాలో ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుంది . హోరాహోరీగా సాగుతున్న పోరులో విజయావకాశాలు ఎవరికి మెండుగా ఉన్నాయి. స్వాతంత్రోద్యమంతో పాటు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు ఎన్నో పోరాటాలు చేశారు.

ఆతర్వాత తొలి, మలిదశ తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమాలతో పాటు ఫ్లోరైడ్ (ఫ్లోరోసిస్) తరిమివేసేందుకు జలసాధనసమితి ఆధ్వర్యంలో ఇక్కడి ప్రజలు పోషించిన పాత్ర అత్యంత కీలకం. ప్రారంభంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న ఈ జిల్లాలో వారిఆధిపత్యాన్ని దెబ్బతీసి క్రమంగా కాంగ్రెస్ పాగావేసింది. కాని తెలంగాణా ఆవిర్భవం తరువాత వచ్చిన టిఆర్ఎస్ ప్రభంజనంలో అన్ని పార్టీల ప్రభావం తగ్గిపోయి టిఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ మెజారిటీ స్ధానాలు గెలచుకుని నల్లగొండను తన కంచుకోటగా మార్చుకుంది.

Nalgonda election war: triangle war in nalgonda; komatireddy venakat reddy in the fray
రాష్ట్రంలోనే అత్యధిక నియోజకవర్గాలున్న జిల్లా నల్లగొండ. మొత్తం 6అసెంబ్లీ నియోజకవర్గాలతో ఉన్న జిల్లాలో నల్లగొండ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరుసగా 4సార్లు గెలిచి రికార్డు సృష్టించాడు. ఉమ్మడి రాస్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నల్లగొండ జిల్లాకు సాగు తాగు నీరందించే ఎస్సెల్బిసి సొరంగమార్గం (టన్నెల్) ప్రాజెక్టు కు శంఖుస్ధాపన చేయించారు.

ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన మంత్రిపదవిని సైతం వదులుకున్నారు. అయితే 2018లో అధికార టిఆర్ఎస్ ద్వారా పోటీచేసిన కంచర్ల భూపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్ది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై 12464 ఓట్ల తేడాతో గెలుపొందడంతో నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధిపత్యానికి గండి పడినట్లయ్యింది.

అయితే ప్రస్తుతం నల్గొండ నియోజకవర్గ పోరు హోరాహోరీగా సాగుతుంది. అభివృద్ధి మంత్రంతో కంచర్ల భూపాల్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇక మళ్ళీ నల్గొండపై గులాబీ జెండా ఎగరవెయ్యాలని కంచర్ల భూపాల్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. జోరుగా ప్రచారం చేస్తున్నారు. పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి దక్కించుకునే క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి శక్తి యుక్తులను ఒడ్డుతున్నారు. ఒక్క రోడ్డు వేసి ఇదే అభివృద్ధి అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు.

మాదగోని శ్రీనివాస్ గౌడ్ బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగి తనను ఆదరించాలని, బీసీ అభ్యర్తినని ప్రచారం చేస్తున్నారు. తన సొంత గడ్డకు అభివృద్ధి చేసేందుకు వస్తున్నానని ఆయన అంటున్నారు. మొత్తంగా ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు పోరు సాగుతుంది. ఈ త్రిముఖపోరులో విజయం సాధించేదెవరు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+