తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ: కేసీఆర్ నిర్ణయంపై పోలీసు వర్గాల్లో పెద్ద చర్చ
హైదరాబాద్: హఠాత్తుగా తెలంగాణ ప్రభుత్వం ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. అందులోనూ కీలక స్థానాల్లో ఉన్న సీనియర్లను బదిలీ చేస్తూ గురువారం రాత్రి అనూహ్యంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలో ప్రస్తుతం ఇంటిజిజెన్స్ ఛీప్‌గా ఉన్న బి.శివధర్‌రెడ్డి కూడా ఉన్నారు.
ఓటుకు నోటు నుంచి నయీం వరకు: పోలీసుల విజయం వెనుక, ఎవరీ బత్తుల శివధర్ రెడ్డిఆయన స్థానంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న నవీన్ చంద్‌ను కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించింది. శివధర్ రెడ్డికి అంతగా ప్రాధాన్యం లేని ఐజీ పర్సనల్ పోస్టింగ్ శాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే స్వయంగా శివధర్ రెడ్డి కోరిక మేరకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

పని ఒత్తిడి
తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్న తనను వేరే శాఖకు బదిలీ చేయాలని శివధర్ రెడ్డే స్వయంగా సీఎం కేసీఆర్‌కు విన్నవించుకున్నారు. కేసీఆర్‌కు నమ్మిన బంటుగా ఉన్న శివధర్ రెడ్డి కోరిన కోరికను కాదనలేకపోయిన కేసీఆర్, ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యతల నుంచి విముక్తిడిని చేశారని తెలుస్తోంది.

ఓటుకు నోటు కేసు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు దర్యాప్తు, గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తదితర కేసుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి కీలక భూమిక పోషించారు. రాష్ట్ర విభజన సమయంలో విశాఖ సీపీగా ఉన్న శివధర్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరి కోరి మరీ తెలంగాణకు రప్పించుకున్నారు.

తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి
అప్పటి నుంచి గురువారం వరకు తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డే వ్యవహరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచి నమ్మకస్తుడనే పేరు కూడా ఉంది. ఈ క్రమంలో గురువారం జరిగిన బదిలీల్లో భాగంగా ఇంటెలిజెన్స్ చీఫ్ లాంటి కీలక పదవి నుంచి శివధర్ రెడ్డిన తప్పించడం పోలీసు వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ గా నవీన్ చంద్
మరోవైపు వరంగల్ రేంజీ డీఐజీ టి.ప్రభాకర్‌రావును డీఐజీ ఇంటెలిజెన్స్‌గా, ఆ పోస్టులో ఉన్న ఎన్.శివశంకర్‌రెడ్డిని సీఐడీ విభాగంలో డీఐజీగా నియమించారు. ప్రస్తుతం సీఐడీ డీఐజీగా ఉన్న రవివర్మకు వరంగల్ రేంజీ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చారు. సీఐడీ ఎస్పీగా ఉన్న కె.రమేశ్‌నాయుడును రాచకొండ కమిషనరేట్‌లో ట్రాఫిక్ డీసీపీగా నియమించారు.












Click it and Unblock the Notifications