కెసిఆర్‌కే పేరు తెచ్చిన హరీష్ రావు: నాయిని, సిద్దిపేట నుంచి ప్రారంభిస్తే ఇంతే
సిద్దిపేట/హైదరాబాద్: భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్నింట్లో ఆదర్శంగా నిలిపి తన మామ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పేరు తీసుకు వచ్చారని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి శుక్రవారం అన్నారు.
స్వచ్ఛ సిద్ధిపేట సమష్టి ఫలితం: హరీష్ రావు
అందరి సహకారంతోనే స్వచ్ఛ సిద్ధిపేటను తయారు చేసుకోగలిగామని హరీష్ రావు చెప్పారు. తన సొంత నియోజకవర్గంలో తక్కువ కాలంలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్న నేపథ్యంలో సిద్ధిపేటలో స్వచ్ఛ సిద్ధిపేట సంబురాల కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్న నియోజకవర్గం ఒక్క సిద్ధిపేట మాత్రమేనన్నారు. మెదక్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మిస్తామని ప్రకటించారు. గ్రామంలో ఎక్కడా మురికి నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు.

వ్యక్తిగత శుభ్రత అందరూ పాటించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ఇబ్రహీంపూర్ గ్రామం మారుపేరన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. సిద్ధిపేటలోని వీధుల్లో అన్ని సీఎఫ్‌ఎల్ బల్బులే అన్నారు.
త్వరలోనే సిద్ధిపేటలో ప్రతి ఇంటికి చెత్తబుట్టను పంపిణీ చేస్తామన్నారు. హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని, మొక్కలు నాటడమే కాదు.. వాటిని కాపాడటం కూడా బాధ్యత అన్నారు. అందరి సమిష్టి కృషితోనే హరితహారం కార్యక్రమం విజయవంతమైందన్నారు.
సిద్ధిపేటలో ఇప్పటి వరకు 30 లక్షల మొక్కలు నాటామన్నారు. ఇవాళ మరో 5 లక్షల మొక్కలు నాటుతున్నామన్నారు. సిద్దిపేట నుంచి ఏది ప్రారంభించినా విజయమే అన్నారు. సమష్టి కృషితో స్వచ్ఛ సిద్దిపేట సాధ్యమైందన్నారు. తెలంగాణకే సిద్దిపేట ఆదర్శమని స్పీకర్ మధుసూదనా చారి అన్నారు. సిద్దిపేటను ఆదర్శంగా నిలిపారన్నారు.
ఈ పంచాయతీ సేవలను ప్రారంభించిన కేటీఆర్
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం దోమకొండ మండలం బీబీ పేట్‌లో ఈ-పంచాయతీ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. 104 గ్రామ పంచాయతీల్లో ఈ - పంచాయతీ సేవలు ప్రారంభించామన్నారు. మరో నెల రోజుల్లో 700 గ్రామాలకు విస్తరిస్తామన్నారు. 15 నెలల కాలంలో తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. అభివృద్ధి ఓర్వలేక ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications