రాష్ట్రంలోకి వరల్డ్ టాప్ బ్రాండ్ల బీర్లు - నాన్‌ ఆల్కాహాలిక్‌ సిద్దం..!!

రాష్ట్రంలో కొత్త బీరు పాలసీ అమల్లోకి రానుంది. ఇందు కోసం ముహూర్తం ఫిక్స్ అయింది. కొద్ది రోజులుగా బీరు ఉత్పత్తుల పైన చర్చ సాగింది. ఇక, ప్రపంచ స్థాయి టాప్ 12 బ్రాండ్ బ్రాండ్లతో పాటుగా మొత్తంగా 200 రకాల బీర్లను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. అదే సమయంలో నాన్ ఆల్కహాలిక్ బ్రాండ్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఈ మేరకు తుది కసరత్తు జరుగుతోంది. ఉగాది నుంచి కొత్త బీరు పాలసీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

కొత్త బీర్ల పాలసీ
తెలంగాణలో కొత్త బీర్ల పాలసీ పైన కసరత్తు జరుగుతోంది. కొద్ది రోజులుగా మద్యం ధరల పెంపు పైన తర్జన భర్జన పడుతున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ సైతం ధరల పెంపుకు వీలుగా కీలక ప్రతిపాదనలు చేసినట్లు చెబుతున్నారు. దీంతో, మద్యం ధరలు పెంపు పైన అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఇప్పుడు బీర్ల విషయంలోనూ కీలక మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం అందు బాటులో ఉన్న వాటితో పాటుగా కొత్తగా మరో 200 రకాల బ్రాండ్లు అందుబాటులోకి వచ్చేందుకు రంగం సిద్దం అవుతోంది. అదే విధంగా నాన్ ఆల్కహాలిక్ బీర్లు తీసుకొచ్చేలా నిర్ణయించారు.

New Beer policy to launch on Ugadi day planning to introduce non alcoholic brands in the market

టాప్ బ్రాండ్ల బీర్లు
కొత్త ఆర్దిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వీటి అమ్మకాలు ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 80 పైకి లోకల్ బ్రాండ్ల బీర్లు అమ్మకాలు సాగుతున్నాయి. అదే విధంగా మరో 350 జాతీయ - అంతర్జాతీయ బ్రాండ్ల సరఫరాకు అనుమతి ఉంది. అందులో 50 బ్రాండ్లు ఉత్పత్తులు నిలిపివేసాయి. కాగా, 150 వరకు బ్రాండ్ల అమ్మకాలు గత పదేళ్లుగా అమ్మకాలు సాగిస్తున్నాయి. దీంతో, కొత్త ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు వచ్చాయి.

నాన్ ఆల్కాహాలిక్ బ్రాండ్లు
మద్యం అమ్మకాల పైన తాజా నివేదికల్లో గత కొంత కాలంగా బీరు తాగేవారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో నాన్ ఆల్కహాలిక్ బీర్లు ప్రవేశ పెట్టే ప్రతిపాదన పైన చర్చ సాగుతోంది. వీటికి తుది ఆమోదం పొందిన తరువాత ఏప్రిల్ నుంచి కొత్త బ్రాండ్ల బీర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా లిక్కర్ ధరల పెంపు పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏ స్థాయిలో ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+