న్యూఇయర్, అమ్మాయిలు రావాలంటూ హాస్టల్ వద్ద ఆకతాయిల వీరంగం, వీడియో తీశారు
హైదరాబాద్: న్యూఇయర్ 2018 సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకలు కొందరికి చేదును కూడా కలిగించాయి. హైదరాబాదులో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించుకున్నారు. దిల్‌సుఖ్ నగర్‌లో కొందరు యువకులు అమ్మాయిల హాస్టల్ వద్ద వీరంగం సృష్టించారు.
న్యూఇయర్ నేపథ్యంలో పీకలదాకా మధ్యం తాగిన కొందరు యువకులు అర్ధరాత్రి సమయంలో అమ్మాయిల హాస్టల్ వద్దకు వెళ్లారు. అక్కడ హడావుడి చేశారు. మద్యం మత్తులో చెలరేగిపోయి మాట్లాడారు.

గేట్ల వద్దకు వచ్చి రాళ్లు విసిరారు
అమ్మాయిల హాస్టల్ వద్దకు వచ్చిన కొందరు యువకులు అక్కడే బైకులపై తిరిగారు. అమ్మాయిలు ఉండే హాస్టల్ గేట్ల వద్దకు వెళ్లి అమ్మాయిలు బయటకు రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హాస్టల్ పైకి రాళ్లు రువ్వారు. అక్కడ చిందరవందర చేశారు.

భయాందోళనకు గురైన అమ్మాయిలు
యువకులు అలా ప్రవర్తించడంతో హాస్టళ్లలో ఉన్న అమ్మాయిలు భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో వారు అలా అమ్మాయిలకు చేస్తుండటంతో ఏం పాలు పోలేదు.

వీడియో తీశారు
ఆకతాయి యువకుల వీరంగాన్ని అక్కడ ఉన్న కొందరు వీడియో తీశారు. దీంతో విషయం వెలుగు చూసింది. హాస్టల్ సిబ్బంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

తూర్పు గోదావరి జిల్లాలో..
న్యూఇయర్ సందర్భంగా పలుచోట్ల అల్లరి మూకలు వీరంగం సృష్టించాయి. తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరంలో అల్లరి మూకలు ఇళ్లకు నిప్పు పెట్టాయి. దీంతో అవి కాలిపోయాయి. కొత్త సంవత్సర వేడుకల పేరుతో కొందరు యవకులు మద్యం తాగి ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications