హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు: ఆ జిల్లాలకు అలర్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల 3 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరానికి కూడా భారీ వర్ష సూచన చేసింది. బయటకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

నల్గొండ, నాగర్‌ కర్నూల్‌, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌, సంగారెడ్డి, మెదక్‌, వరంగల్‌, జగిత్యాల, జనగామ, మహబూబ్‌నగర్‌, హన్మకొండ, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

 Next Three hours heavy rains in Telangana: some districts on alert

పొలాలకు వెళ్లిన రైతులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురిసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శఆఖ హెచ్చరించింది.

కాగా, ఇప్పటికే హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. దీంతో అయిజ శివారులోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మేడికొండ, పులికల్, చిన్న తాండ్రపాడు, వేణిసోంపురం, కేశవరం గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో చెరువులు నిండు కుండల్లా మారాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+