వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎన్జీటీ బ్రేక్ .. తెలంగాణా సర్కార్ కు షాక్; జగన్ ఇచ్చిన ఝలక్ !!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సర్కార్ కు షాక్ ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను వెంటనే ఆపివేయాలని పేర్కొన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టవద్దని పేర్కొంది . నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

పాలమూరు రంగారెడ్డిపై కేంద్రాన్ని ఇరికిస్తున్న ఏపీ ప్రభుత్వం; కేంద్రం వైఖరి చెప్పాలంటూ ఎన్జీటీలో వాదన!!పాలమూరు రంగారెడ్డిపై కేంద్రాన్ని ఇరికిస్తున్న ఏపీ ప్రభుత్వం; కేంద్రం వైఖరి చెప్పాలంటూ ఎన్జీటీలో వాదన!!

 పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఆపండి .. తెలంగాణాకు ఎన్జీటీ ఆదేశాలు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఆపండి .. తెలంగాణాకు ఎన్జీటీ ఆదేశాలు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అనుమతుల ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగలేదని పేర్కొన్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అటవీ పర్యావరణ అనుమతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకున్నట్లుగా కనిపించలేదని పేర్కొంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందలేదు . అటవీ పర్యావరణ శాఖ కు సంబంధించిన అనుమతుల ప్రక్రియ పూర్తయిన తరువాత మాత్రమే పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్టుకు సంబంధించి తరువాత పనులు చేపట్టేందుకు అవకాశం ఇవ్వగలమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. అప్పటి వరకూ పాలమూరు-రంగారెడ్డి పనులు నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ పేర్కొంది.

 పాలమూరు రంగారెడ్డితో పర్యావరణ హాని.. తెలంగాణా సర్కార్ ను టార్గెట్ చేసిన ఏపీ సర్కార్ వాదనలు

పాలమూరు రంగారెడ్డితో పర్యావరణ హాని.. తెలంగాణా సర్కార్ ను టార్గెట్ చేసిన ఏపీ సర్కార్ వాదనలు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఏపీ సర్కార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో బలంగా తన వాదనలు వినిపించింది. ఇదే సమయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కేంద్రం వైఖరి చెప్పాలని కూడా ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా,పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తుందని, దీనివల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పర్యావరణ హాని కలుగుతుందని పేర్కొన్న ఏపీ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో తెలంగాణ ప్రభుత్వ తీరును టార్గెట్ చేస్తూ బలంగా వాదించింది.

హోరాహోరీగా ఎన్జీటీలో ఏపీ వర్సెస్ తెలంగాణా

హోరాహోరీగా ఎన్జీటీలో ఏపీ వర్సెస్ తెలంగాణా

జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై ధర్మాసనం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు ప్రతివాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి కోసం ఈ ప్రాజెక్టును చేపట్టిందని, కానీ తాగునీటి ప్రాజెక్టు పేరుతో పర్యావరణ అనుమతులను తీసుకోకుండా పనులు మొదలు పెట్టిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వాదనపై ప్రతి వాదనలు చేసిన తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలుకు ఆరు నెలల కాలపరిమితి ఉంటుందని ఆ సమయం మించి దాఖలు చేసిన పిటిషన్లను విచారించకూడదని పేర్కొన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హమైనదని ఏపీ ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు.

ట్రిబ్యునల్ 1, 2 లలో కేటాయింపు లేకున్నా, చట్టాలను ఉల్లంఘించి తెలంగాణా ప్రాజెక్ట్ నిర్మాణం

ట్రిబ్యునల్ 1, 2 లలో కేటాయింపు లేకున్నా, చట్టాలను ఉల్లంఘించి తెలంగాణా ప్రాజెక్ట్ నిర్మాణం

కృష్ణా జల వివాదాలకు సంబంధించిన ట్రిబ్యునల్ 1, 2 లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు ఎలాంటి కేటాయింపు లేదని, పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో కూడా లేదని జాతీయ హరిత ట్రిబ్యునల్ ముందు ఏపీ సర్కార్ పేర్కొంది. దీనివల్ల రెండు రాష్ట్రాల్లోనూ పర్యావరణంపై ప్రభావం ఉంటుందంటూ ఎన్జీటీ ఎదుట రెండు అఫిడవిట్లను దాఖలు చేసింది. చట్టాలను ఉల్లంఘించి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు కట్టే హక్కు లేదని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ దృష్టికి తీసుకు వెళ్ళింది.

పాలమూరు రంగారెడ్డి పై సంయుక్త కమిటీ నివేదిక .. తెలంగాణాకు జరిమానా వెయ్యాలని సిఫార్సు

పాలమూరు రంగారెడ్డి పై సంయుక్త కమిటీ నివేదిక .. తెలంగాణాకు జరిమానా వెయ్యాలని సిఫార్సు


ఇదిలా ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పై సంయుక్త కమిటీ ఇచ్చిన నివేదికలో తాగునీటి ప్రాజెక్టు అని చెప్పి సాగునీటి ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను చేపట్టారని ధ్రువీకరించింది. తప్పుడు నివేదిక అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించాలని కమిటీ సిఫార్సు చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు తెలంగాణ రాష్ట్రానికి 3 కోట్ల 80 లక్షల రూపాయల జరిమానా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది.

పాలమూరు రంగారెడ్డిపై ఏపీ వాదనతో ఏకీభవించిన ఎన్జీటీ .. తెలంగాణాకు చుక్కెదురు

పాలమూరు రంగారెడ్డిపై ఏపీ వాదనతో ఏకీభవించిన ఎన్జీటీ .. తెలంగాణాకు చుక్కెదురు

2015 లో ఇచ్చిన జీవో ప్రకారం తాగునీటి ప్రాజెక్టు కోసం మాత్రమే నిర్మాణం చేపట్టామని, రెండవ దశలో సాగునీటి ప్రాజెక్టుకు అనుమతులు కోరామని, పర్యావరణ అనుమతులు వచ్చేవరకూ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేయబోమని తెలంగాణా తరపున రామచందర్ రావు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు వాదించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాల నేపధ్యంలో పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్న పనులను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ను ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో ఏపీ ప్రభుత్వం వాదనతో ఏకీభవించిన ఎన్జీటీ తెలంగాణా సర్కార్ కు షాక్ ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి పనులను నిలిపివేయ్యాలని ఆదేశాలిచ్చింది. ఎన్జీటీలో తెలంగాణాకు చుక్కెదురైంది.

శరవేగంగా ప్రాజెక్ట్ పనులు .. కేంద్రానికి కేసీఆర్ విజ్ఞప్తి, అయినా సరే పనులపై ఎన్జీటీ స్టే

శరవేగంగా ప్రాజెక్ట్ పనులు .. కేంద్రానికి కేసీఆర్ విజ్ఞప్తి, అయినా సరే పనులపై ఎన్జీటీ స్టే

ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు శరవేగంగా కొనసాగేలా చేయాలని పనులను స్పీడ్ అప్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మరీ మంత్రి ఆదేశాలిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదిలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్ లకు నీళ్లు ఇచ్చే విధంగా పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి కాలువల పైన ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇక మరోవైపు జలవివాదాలపై ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసిన సందర్భంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇబ్బందుకు లేకుండా చూడాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అత్యంత అవసరమైన ప్రాజెక్ట్ అని, పాలమూరు పూర్తిగా కరువు కరువు పీడిత ప్రాంతమని, సాగునీరు తాగునీరు కొరతతో అల్లాడుతున్న ప్రాంతమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అయినాసరే ఎన్జీటీ విచారణలో తెలంగాణా వాదనలో ఫెయిల్ అవ్వటం వల్ల తెలంగాణా వాదన పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్జీటీ పాలమూరు రంగారెడ్డి పనులపై స్టే విధించింది.

English summary
The National Green Tribunal has directed the Telangana govt to stop the Palamuru Rangareddy works, said that things should not be done without environmental permits. The NGT agreed with the AP argument, gave a shock to the Telangana govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X