Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిన NGT.. ఆ పథకానికి బ్రేక్..

కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్(NGT) ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడంపై మండిపడింది. రైతులు, స్థానికుల ఫిర్యాదులపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్(NGT) స్పందించింది. ఈ మేరకు పర్యావరణ అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మెట్ట ప్రాంత రైతుల చిరకాల స్వప్నంగా నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకం ఉంది. ఈ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని 2014లోనే జీఓ జారీ అయినప్పటికీ ఏళ్లుగా అమలుకు నోచుకోలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏడాది ఫిబ్రవరి 21న సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట-కొడంగల్-మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. నిర్మాణ అంచనా రూ.4,350 కోట్లుగా పేర్కొన్నారు. ఈ పథకానికి 2024-25 బడ్జెట్‌ కేటాయింపుల్లో భాగంగా రూ.610 కోట్లను కేటాయించారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్‌, మక్తల్‌ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీటితో పాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చడానికి వీలుగా రెండు దశల్లో నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. అయితే తాజాగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్(NGT) రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.

NGT Puts Brakes on Kodangal-Narayanpet Lift Irrigation Scheme Work

పర్యావరణ అనుమతులు లేని కారణంగా ఈ ప్రాజెక్ట్ పనులను ఆపివేయాలని NGT స్పష్టం చేసింది. ఈ పథకం పనులపై రైతులు నర్సింహులు, మరో ముగ్గురు స్థానికులు NGTలో ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్ జీటీ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి. NGT తెలిపిన ప్రకారం.. ప్రాజెక్ట్ పనులు వెంటనే నిలిపివేయకపోతే, బాధితులు మళ్లీ తమను సంప్రదించవచ్చని పేర్కొంది. NGT ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం త్వరగా మార్గదర్శక చర్యలు చేపట్టనుంది. ఈ ప్రాజెక్ట్ రద్దు లేదా ఆలస్యం జరిగితే, రాష్ట్రానికి ఆర్థిక, సామాజిక పరిమాణంలో పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+