Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ కోసం.. ఏకంగా కన్న కూతురినే..!

సమాజంలో రానురాను మానవ సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయి. కన్నవారినే పొట్టన పెట్టుకుంటున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. అలాగే కడుపున పుట్టిన పిల్లల్ని సైతం నిర్దాక్షిణ్యంగా హతమార్చుతున్న ఘటనలు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయి. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తాను సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కన్నకూతురినే కడతేర్చాడు.

నిజామాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం ఏకంగా కన్న కూతురినే కిరాతకంగా హతమార్చాడు ఓ కసాయి తండ్రి. సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు ఉన్నవారు మాత్రమే అర్హులు అని అక్కడి నిబంధనలు ఉన్నాయి. ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తి సర్పంచ్‌ గా పోటీ చేయడానికి అర్హత లేదు. అయితే ఎలాగైనా తాను సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆ వ్యక్తి తన ముగ్గురు పిల్లల్లో ఓ పాపను కిరాతకంగా చంపాడు.

పోలీసుల కథనం ప్రకారం.. పాండురంగ అనే వ్యక్తి మహారాష్ట్రలోని కేరూరు సర్పంచ్‌ గా పోటీ చేయాలనుకున్నాడు. అయితే అక్కడి నిబంధనల ప్రకారం ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తి సర్పంచ్‌ గా పోటీ చేయడానికి అర్హత లేదు. అయితే పాండురంగకు మాత్రం ముగ్గురు పిల్లలు ఉన్నారు. కానీ ఎలాగైనా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆ వ్యక్తి అత్యంత కిరాతకంగా ఆలోచన చేశాడు. తనకున్న ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేస్తే పోటీకి ఎలాంటి అడ్డంకి ఉండదని భావించాడు. దాంతో తన పెద్ద కూతురును చంపేయాలని ప్లాన్ వేశాడు.

nizamabad Shocker Maharashtra Man Kills Own Daughter to Contest Sarpanch Election

ఇక పథకం ప్రకారం నిజామాబాద్‌ జిల్లాలోని ఎడపల్లికి పెద్ద కుమార్తె ప్రాచీని తీసుకొచ్చాడు పాండురంగ. నిజాం సాగర్ కాలువలో నీళ్లను చూద్దామని కాలువ ఒడ్డుకు తీసుకెళ్లాడు. అలా చిన్నారిని కెనాల్ లోకి నెట్టి ఇంటికి వెళ్లాడు. అయితే పోలీసుల విచారణలో పాండురంగ నిజం ఒప్పుకున్నాడు. దాంతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ సాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+