బండ్ల ఇండ్ల గూడ లేక‌పాయె..! పూర్తిగా హాండిచ్చిన కాంగ్రెస్..!!

హైద‌రాబాద్ : తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచయం అక్క‌ర్లేని టాలీవుడ్ నిర్మాత‌, కాంగ్రెస్ పార్టీ నేత‌ బండ్ల గ‌ణేశ్ మ‌రోసారి కామెడీ అయిపోయారు. టాలీవుడ్ లోకి క‌మెడియ‌న్‌గా ఎంట్రీ ఇచ్చిన గ‌ణేష్, ఆ తర్వాత బ‌డా నిర్మాత‌గా చ‌క్రం తిప్పేశారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వీరాభిమానిగా త‌న‌ను తాను చెప్పుకున్న బండ్ల రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస‌రికి జ‌న‌సేనానికి భారీ షాకిచ్చి హ‌స్తం పార్టీ నేత‌గా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు.

ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ప‌రాభ‌వం..! పెద్ద‌ల స‌భ‌కు ప్ర‌య‌త్నించిన బండ్ల‌..!

ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ప‌రాభ‌వం..! పెద్ద‌ల స‌భ‌కు ప్ర‌య‌త్నించిన బండ్ల‌..!

మొన్న‌టి తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని, ఎమ్మెల్యేగా గెలుపొంద‌డంతో పాటుగా ఏకంగా మంత్రినే అవుతానంటూ బాగానే ఉప‌న్యాస‌లు దంచేసారు. అయితే చివ‌ర‌కు టికెట్ కు కొర‌గాకుండా పోవ‌డంతో పాటు కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌క‌పోతే, గొంతు కోసుకుంటాన‌ని ప్ర‌క‌టించి అభాసుపాల‌య్యారు. సీన్ క‌ట్ చేస్తే, ఇప్పుడు తెలంగాణ శాస‌న మండ‌లి ఎన్నిక‌ల సంద‌ర్భంగా మ‌రోమారు తెర మీద‌కు వ‌చ్చేశారు బండ్ల గ‌ణేష్.

గ‌ణేష్ ప‌వ‌న్ వీరాభిమాని..! కాని కాంగ్రెస్ లో చేరిన క‌మెడియ‌న్..!!

గ‌ణేష్ ప‌వ‌న్ వీరాభిమాని..! కాని కాంగ్రెస్ లో చేరిన క‌మెడియ‌న్..!!

దిగువ స‌భ‌కు ఎలాగూ అవ‌కాశం ద‌క్క‌లేద‌ని, దీంతో ఏకంగా పెద్ద‌ల స‌భ‌లోనే అడుగుపెడ‌తానంటూ ఇప్పుడు బండ్ల త‌న‌దైన శైలిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ద‌క్కే సీటు ఒక్క‌టే కావ‌డంతో ఇప్పుడూ బండ్ల న‌వ్వులపాలు కాక త‌ప్పదంటూ గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ విశ్లేష‌ణ‌లు నిజ‌మేన‌న్న‌ట్లుగా ఇప్పుడు కూడా బండ్ల‌కు కాంగ్రెస్ పార్టీ రిక్త‌హ‌స్త‌మే ఇచ్చింది.

ఊరించిన ఎమ్మెల్సీ టికెట్..! చివ‌రి నిమిషంలో మ‌రొక‌రికి సీటు..!!

ఊరించిన ఎమ్మెల్సీ టికెట్..! చివ‌రి నిమిషంలో మ‌రొక‌రికి సీటు..!!

త‌మ‌కు ద‌క్కే ఒకే ఒక్క సీటును హ‌స్తం పార్టీ., సీనియ‌ర్ నేత గూడూరు నారాయ‌ణ రెడ్డికి కేటాయించింది. పార్టీలో సుదీర్ఘ కాలంగా కొన‌సాగుతూ వ‌స్తున్న నారాయ‌ణ రెడ్డి అవ‌కాశాలు పెద్ద‌గా ద‌క్క‌క‌పోయినా, పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. పెద్ద సంఖ్య‌లో కాంగ్రెస్ నేత‌లు ఈ టికెట్ కోసం య‌త్నాలు చేసినా చివ‌రి నిమిషం దాకా నిర్ణ‌యాన్ని వాయిదా వేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నామినేష‌న్‌కు గ‌డువుకు కొన్ని గంట‌ల ముందుగా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది.

టీడిపి స‌హ‌కారంతో గ‌ట్టెక్క‌నున్న గూడూరు..! ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్న టీ కాంగ్రెస్..!!

టీడిపి స‌హ‌కారంతో గ‌ట్టెక్క‌నున్న గూడూరు..! ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్న టీ కాంగ్రెస్..!!

ఇదిలా ఉంటే.. నారాయ‌ణ రెడ్డి ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాలంటే, 21 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం కానుంది. అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి. టీడీపీ సాధించిన మ‌రో రెండు ఎమ్మెల్యేల ఓట్లు కూడా కాంగ్రెస్‌కు ప‌డితే నారాయ‌ణ రెడ్డి గెలుపు సుల‌బ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే మొత్తం ఐదు సీట్ల‌లో త‌న‌కు ద‌క్క‌నున్న నాలుగు సీట్ల‌తో పాటు ఐదో సీటుకు కూడా టీఆర్ఎస్ త‌న అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపింది. అంటే ఈ ఐదో సీటుకు జ‌రిగే ఎన్నిక‌ల ఆస‌క్తిక‌రంగా మారనున్న‌ట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+