హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాలో వర్షాల అలర్ట్

హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత, ఉక్కపోత ఉంటుండగా.. సాయంత్రం నుంచి మాత్రం జోరు వానలు పడుతున్నాయి. గత కొద్దిరోజులుగా నగరంలో ఇదే జరుగుతోంది. సాయంత్రం వర్షాలు కురుస్తోండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి.

తాజాగా వాతావరణ శాఖ హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం నాడు ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Normal to heavy rain today in telangana districts Weather department

గురువారం రోజు అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

శుక్రవారంనాడు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ద్రోణి ఒకటి మధ్య గుజరాత్ ప్రాంతాలలో కేంద్రీకృతమైన ఆవర్తనం నుంచి మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ మీదుగా తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

మరోవైపు,ఆవర్తనం పశ్చిమ మధ్య దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కి.మీ. మధ్య కొనసాగుతుందన్నారు. ఈ క్రమంలో రానున్న రెండు మూడు రోజులపాటు హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారంనాడు హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. సాయంత్రం నుంచి వాతావరణం చల్లగామారిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+