వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటికి వెళ్తే ఏం చేశారంటే: చిరంజీవి-రాజశేఖర్‌లను కలిపిందెవరు?

పదేళ్ల క్రితం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు నటుడు రాజశేఖర్ విమర్శలు చేశారు. దీంతో మెగాస్టార్ అభిమానులు రాజశేఖర్, జీవిత దంపతులను హైదరాబాద్ వరకు అనుసరించడం అప్పుడు కలకలం రేపింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

చిరంజీవి ఇంటికి అందుకే వెళ్ళాం..!

హైదరాబాద్: పదేళ్ల క్రితం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు నటుడు రాజశేఖర్ విమర్శలు చేశారు. దీంతో మెగాస్టార్ అభిమానులు రాజశేఖర్, జీవిత దంపతులను హైదరాబాద్ వరకు అనుసరించడం అప్పుడు కలకలం రేపింది. మెగా అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల ఒక్కటైన చిరంజీవి, రాజశేఖర్

ఇటీవల ఒక్కటైన చిరంజీవి, రాజశేఖర్

చిరు ఫ్యాన్స్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని రాజశేఖర్, జీవితలు మీడియాకు ఎక్కారు. ఆ తర్వాత చిరంజీవి వారి వద్దకు వెళ్లారు. కానీ వారి మధ్య సయోధ్య కుదరలేదు. కానీ ఇటీవల గరుడవేగ సినిమా కోసం రాజశేఖర్ ఆయన ఇంటికి వెళ్లడం, సినిమాను చిరంజీవి పొగడటం తెలిసిందే.

 కలవడానికి కారణం ఎవరో చెప్పిన రాజశేఖర్

కలవడానికి కారణం ఎవరో చెప్పిన రాజశేఖర్

ప్రస్తుతం రాజశేఖర్ - చిరంజీవిల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే కొన్నేళ్లు ఉప్పు నిప్పులా ఉన్న వీరు కలవడానికి రాజశేఖర్ కూతురు శివాని పరోక్షంగా కారణం అయ్యారట. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ వెల్లడించారు.

శివానీ మెడికల్ సీటు కోసం వెళ్తే

శివానీ మెడికల్ సీటు కోసం వెళ్తే

చిరంజీవితో విభేదాలు వచ్చాక కొన్నేళ్లు దూరంగా ఉన్నామని, అప్పుడప్పుడు కలుసుకున్నా మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నది లేదని, ఓసారి తన కూతురు శివాని మెడికల్ సీటు కోసం అపోలో కాలేజీలో దరఖాస్తు చేశామని, దీని కోసం జీవిత.. చిరంజీవి వద్దకు వెళ్లిందని తెలిపారు.

చిరంజీవి రిసీవ్ చేసుకోవడంపై

చిరంజీవి రిసీవ్ చేసుకోవడంపై

జీవిత వెళ్లాక.. చిరంజీవి తన గురించి అడిగారని, రమ్మనమని చెప్పారని, కానీ తాను వెళ్లలేదని రాజశేఖర్ చెప్పారు. మొదట జీవిత ఫోన్ చేసి పిలిస్తే తాను వెళ్లలేదని, కానీ ఆమెనే ఇంటికి వచ్చి తనను తీసుకు వెళ్లిందని, ఆ సమయంలో చిరంజీవి తనను రిసీవ్ చేసుకున్న తీరుతో విభేదాలు తొలగిపోయాయన్నారు.

ఎప్పటిలా కలిసిపోయారు

ఎప్పటిలా కలిసిపోయారు

ఆ తర్వాత తాము ఇద్దరం ఎప్పటిలాగే కలిసిపోయామని రాజశేఖర్ వెల్లడించారు. గరుడవేగ సినిమాకు ఆయన సపోర్ట్ చేశారని చెప్పారు. కాగా, ఈ సినిమాను చూడాలని కోరుతూ జీవిత, రాజశేఖర్‌లు చిరంజీవి ఇంటికి వెళ్లి విజ్ఞప్తి చేశారు.

English summary
Now, There is no differences between Actor Rajasekhar and Actor Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X