హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ స్టేడియం స్థానంలో కళాభారతి, ఇవి ఉంటాయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇందిరా పార్కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాభారతిని ఏర్పాటు చేయనుంది. 14 ఎకరాల్లో నిర్మించనున్న కళాభారతి భవన నమూనాకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం నాడు ఆమోద ముద్ర వేశారు. భవన నిర్మాణానికి త్వరలో సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు.

కళాభారతి నిర్మాణం తెలంగాణ రాష్ట్ర చరిత్ర, వారసత్వ, నిర్మాణ కౌశలానికి చిహ్నంగా ఉంటుందన్నారు. కళాభారతిలో నాలుగు మీటింగ్‌ హాళ్లతోపాటు సినిమా థియేటర్లు, లైబ్రరీలు, గెస్ట్‌హౌస్‌లు, గ్యాలరీ, రెస్టారెంట్లు నిర్మించనున్నారు. అంతేకాక సంగీత నాటక అకాడమీ కార్యకలాపాలకు ప్రత్యేకంగా భవనాలు నిర్మిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే కళాభారతిలో నాలుగు వేర్వేరు సామర్థ్యాలతో ఆడిటోరియాలను నిర్మించనున్నట్టు పేర్కొన్నారు.

కాగా, ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన నిర్మాణ నమూనాకు కేసీఆర్ ఆమోదం తెలిపారు. గతంలో రెండుసార్లు కేసీఆర్‌ను కలిసిన హఫీజ్.. ఇప్పుడు నమూనాను కేసీఆర్‌కు అందించారు. ఇందిరాపార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతిని నిర్మించనున్నారు.

NTR stadium paves way for Kalabharathi

మూడువేల మంది కూర్చునే సామర్థ్యం గల ఒక ఆడిటోరియం, 1500 మంది కూర్చునేలా రెండు ఆడిటోరియాలు, 500 మంది కూర్చునేలా మరో ఆడిటోరియం నిర్మిస్తారు. అత్యాధునిక థియేటర్, ప్రివ్యూ థియేటర్, కళాకారులకు శిక్షణ, రిహార్సల్స్ కోసం ప్రత్యేక హాళ్లు, గ్రంథాలయం, ఆర్ట్ మ్యూజియం, గ్యాలరీ, చిత్రకళా ప్రదర్శన మందిరం, శిల్ప మందిరం, వీఐపీ, మీడియా లాంజులు ఉంటాయి.

మూడు ప్రత్యేక సెమినార్ హాళ్లు, డార్మిటరీ, అతిథి గృహాలు, మూడు రెస్టారెంట్లు, 40 గదులు, 10 సూట్లు, పెద్ద భోజన శాల ఉంటుంది. లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాటమీలు, వాటి కార్యాలయాలు ఉంటాయి. చల్లదనం ఇచ్చే నీటి కొలనులు, ఫౌంటేన్లు, పచ్చిక బయళ్లు ఉంటాయి. మూడువేల వాహనాలు నిలిపే విధంగా నిర్మిస్తారు. అన్నీ ఆధునికంగా ఉంటాయి.

English summary
NTR stadium paves way for Kalabharathi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X