సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బామ్మగారు.. ఆ పాటలేంది.. ఆ ఆటలేంది..!
హైదరాబాద్ : టిక్కుటాక్కు వీడియోల హడావిడి అంతా ఇంతా కాదు. కాన్సెప్ట్ ఏదైనా ధనాధన్ ఏక్ వీడియో నికాల్కే అప్‌లోడ్ ఖర్నా.. ఇది నేటి యువత ట్రెండ్. మంచి మేసేజేస్ ఇచ్చేవారు కొందరుంటే.. పనికిరాని చెత్త వీడియోలు తీసి పరేషాన్ చేసేవారు మరికొందరు. ఇక వీరికి భిన్నంగా ఇంకొందరు ఉంటారు. వారి పని ఇతరులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడమే. ఆ క్రమంలో వివిధ పాటలకు అనుగుణంగా నర్తిస్తూ.. కొన్ని డైలాగులకు అభినయం చేస్తూ మెప్పు పొందుతున్నారు.
అయితే అలాంటి కోవలో ఇప్పుడు ఓ బామ్మ చేరారు. బామ్మ అంటే ఏ యాబై అరవై ఏళ్ల బామ్మ కాదు. దాదాపు 75 సంవత్సరాలు ఉంటాయేమో. పర్సనాలిటీ కూడా కాస్తా లావుగానే ఉంది. అయితేనేం తనకున్న నృత్య ప్రతిభా పాటవాలను బయటి ప్రపంచానికి చూపించారు. వివిధ పాటలకు డ్యాన్స్ చేస్తూ.. అదిరేటి స్టెప్పులతో దడదడలాడించారు. ఇంట్రెస్ట్ ఉండాలే తప్ప ప్రతిభకు వయసు అడ్డుకాదని నిరూపించారు.

బామ్మ రాకింగ్.. సోషల్ మీడియా షేకింగ్..!
ఆ బామ్మ ఎక్కడుంటారో తెలియదు.. ఏమి చేస్తారో తెలియదు.. పోనీ ఏ దేశంలో ఉంటారో కూడా తెలియదు. కానీ టిక్‌టాక్ వీడియోలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అందమైన పాటలకు అనుగుణంగా పాదాలు కలుపుతూ తనలోని నటనా కౌశల్యాన్ని వెలికితీశారు. బామ్మ చేసిన వీడియోలు చూసి ప్రతి ఒక్కరూ విస్మయానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో చాలామంది స్మార్ట్‌ఫోన్లకు ఆమె వీడియోలు చేరాయి. ఆమె డ్యాన్స్ చేసిన వీడియోలు చూసి ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు కుర్రకారు.
అలా ఎన్ని వీడియోలు తీశారో తెలియదు గానీ.. బయటకొచ్చిన కొన్ని వీడియోల్లో మాత్రం బామ్మ దుమ్ములేపారు. పాటకు అనుగుణంగా స్టెప్పులేస్తూ అదుర్స్ అనిపించారు. అయితే కొందరు మాత్రం ఈ బామ్మలో తమ బామ్మను చూసుకుంటున్నారనే వాదనలు లేకపోలేదు. ఉపాధి కోసం ఎక్కడో నగరాల్లో నివసిస్తున్నవారు.. అయ్యో నాయనమ్మలు, అమ్మమ్మలను మిస్సవుతున్నామంటూ కామెంటుతున్నారట. ఎందరో టిక్కుటాక్కు వీడియో సెలబ్రిటీలు.. అందులో ఈ బామ్మకు మాత్రం వందనాలు చెప్పాల్సిందేనేమో మరి..!












Click it and Unblock the Notifications