తెలంగాణలో నెల రోజుల పాలన- ఇట్లు.. మీ రేవంతన్న

Revanth Reddy: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరిపాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆరు ఉచిత గ్యారంటీల అమలు.. వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంపై దృష్టి సారించారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా నెల రోజులైంది. కిందటి నెల ఇదే రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది ప్రజలు హాజరయ్యారు.

One month for Congress govt in Telangana, CM Revanth Reddy key remarks

కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఇందులో పాల్గొన్నారు. రేవంత్, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేవంత్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.

తన నెల రోజుల పరిపాలనపై రేవంత్ రెడ్డి స్పందించారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తనకు తృప్తిని ఇచ్చిందని అన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదనే మాటను నిలబెట్టుకుంటోన్నానని, పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తోన్నానని వ్యాఖ్యానించారు.

అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేదల గొంతుకను వింటూ, యువత భవితకు దారులు వేస్తూ, ఆడబిడ్డల మొఖంలో ఆనందాలను చూస్తూ సాగిన ఈ నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపు సాగుతోందని పేర్కొన్నారు.

One month for Congress govt in Telangana, CM Revanth Reddy key remarks

రాష్ట్రంలో ప్రతి రైతుకూ భరోసాను ఇస్తోన్నామని రేవంత్ స్పష్టం చేశారు. అదే సమయంలో పెట్టుబడులను సాధించడానికీ తాము కట్టుబడి ఉన్నామని వివరించారు. పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తోన్నామని, హైదరాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని నగరాలను సమానంగా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.

మత్తు లేని తెలంగాణ సమాజం కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని పేర్కొన్నారు. రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా ముఖ్యమంత్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+