HBD KTR: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ - కేటీఆర్ లోకల్ టు గ్లోబల్, గిఫ్ట్ ఏ స్మైల్..!!
కల్వకుంట్ల తారక రామారావు. సిరిసిల్లలో రామన్న. ఐటీ సిటీలో కేటీఆర్. ఈ రోజు మంత్రి కేటీఆర్ 47వ జన్మదినం. పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు ప్రారంభించాయిజ ఈ సమయంలో కేటీఆర్ వినూత్నంగా తన జన్మదినం అనాధ పిల్ల మధ్య జరుపుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కేటీఆర్‌ది ఓ ప్రత్యేక స్థానం. లోకల్ టు గ్లోబల్ ఏ విషయమైనా వేగంగా స్పందించే గుణం ఉన్న కేటీఆర్ రాజకీయంగా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అంటూ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
వినూత్నంగా కేటీఆర్ బర్త్ డే:మంత్రి కేటీఆర్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. తన జన్మదినం నాడు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడలో నడుస్తున్న స్టేట్ హోంలోని అనాథ పిల్లలకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించారు. తన 47వ పుట్టిన రోజు సందర్భంగా.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 10, 12వ తరగతుల్లో ప్రతిభావంతులైన 47 మంది పిల్లలకు, ప్రొఫెషనల్ కోర్సుల నుంచి మరో 47 మంది పిల్లలకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్‌లు అందిస్తానని తెలిపారు. వారి బంగారు భవిష్యత్‌కై బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా రెండేండ్ల పాటు అత్యుత్తమ కోచింగ్ ఇప్పిస్తానని స్పష్టం చేశారు.

పాలన..పార్టీలో క్రియాశీలకంగా:ప్రతి రోజు గెలవాలనుకునే ఆ పిల్లల కలలను సాకారం చేసే దిశగా ముందడుగు వేయాలన్నారు సూచించారు. తన బర్త్ డే సందర్భంగా ప్రకటనల కోసం డబ్బులు ఖర్చు చేయకుండా.. ఎవరికి తోచిన మార్గంలో వారు అనాథ పిల్లలకు సహాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరుతున్నానని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ మడమతిప్పని పోరాటం చేశారు. 2009లో తొలిసారి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
తెలంగాణ కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడలేదు. తిరిగి 2010 ఉప ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక 2014 నుంచి ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రిగా తనదైన శైలిలో బాధ్యతలు నిర్విర్తిస్తున్నారు. 2018లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. పార్టీలో..ప్రభుత్వంలో క్రియాశీలకంగా మారారు.

లోకల్ టు గ్లోబల్:కేటీఆర్ జన్మదినం వేళ తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో మంత్రి కేటీఆర్ చురుగ్గా ఉంటారు. ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు, ప్రజలతో తన భావాలను పంచుకొనే వేదికగానే ట్విట్టర్‌ను వినియోగిస్తుంటారు.
'ఆస్క్ కేటీఆర్' హ్యాష్‌ట్యాగ్‌తో ప్రజలను నుంచి సమస్యలను తానే స్వయంగా తెలుసుకుంటుండడం విశేషం. ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడడమేగాక స్వయంగా ఆయనే ట్వీట్ చేస్తుంటారు. మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో 40.52 లక్షలు, ఫేస్‌బుక్‌లో 11.11 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 13.77 లక్షలు, లింక్‌డిన్‌లో 2.55 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఐటీ విస్తరణ..పెట్టబడుల ఆకర్షణ కేటీఆర్ పనితీరుకు నిదర్శనం. పార్టీలో పక్కా మాస్ లీడర్ గా... బాహ్య ప్రపంచలో ఐటీ బ్రాండ్ ప్రమోటర్ గా కేటీఆర్ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.












Click it and Unblock the Notifications