బాహుబలి: ‘కాళకేయ’ను చూసి గర్వపడుతున్న పాలమూరు వాసులు
హైదరాబాద్: తమ గ్రామం నుంచి నటుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి ఎన్నో పాత్రలు పోషించిన ప్రభాకర్ గౌడ్.. బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో ‘కాళకేయ'గా ఆకట్టుకోవడం పట్ల మహబూబ్‌నగర్ జిల్లా హస్నాబాద్ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. సినిమాలో కీలక పాత్ర పోషించి తమ గ్రామానికి గుర్తింపు తెస్తున్నాడని సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి' చిత్రంలో కొడంగల్ మండలంలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన ప్రముఖ సినిమా విలన్ ప్రభాకర్‌గౌడ్ కాలకేయ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. శుక్రవారం సినిమా వీక్షించిన జిల్లా వాసులు.. ముఖ్యంగా హస్నాబాద్ గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

ప్రభాకర్‌గౌడ్ కొన్ని సంవత్సరాల కిందటే గ్రామం విడిచి హైదరాబాద్‌కు ఉద్యోగరీత్యా వెళ్లాడు. అనుకోకుండా సినిమాలో చిన్న చిన్న అవకాశాలను అందిపుచ్చుకుని దర్శకుడు రాజమౌళి నిర్మించిన మర్యాద రామన్న సినిమాలో ప్రత్యేకత ఉన్న పాత్రలో నటించాడు. ఆ తర్వాత ఆయన వరుసగా పెద్ద పెద్ద హీరోల సరసన పలు పాత్రలు చేస్తూ వస్తున్నారు.
జులై 10న విడుదలైన బాహుబలి సినిమాలో ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో ఒకటైన కాళకేయ అధిపతి పాత్ర పోషించాడు. సినిమా చూసిన గ్రామస్తులు, యువకులు తమ గ్రామానికి చెందిన వ్యక్తి, పదేళ్ల కిందట తమ మధ్య ఉన్న వ్యక్తి ప్రపంచ స్థాయికి చేరడంతో వారి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications