లగచర్ల దాడి ఘటనపై జైలు నుండి పట్నం నరేందర్ రెడ్డి లేఖ.. సంచలన విషయాలు!
వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ తో పాటు అధికారులపైన లగచర్లలో దాడి చేసిన కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి ని పోలీసులు కోర్టు ముందు హాజరు పరచగా, కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది .ఇక ఈ క్రమంలో జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి లేఖ విడుదల చేశారు .ఈ లేఖలో అనేక కీలక విషయాలను వెల్లడించారు.
తన పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు
అసలు రిమాండ్ రిపోర్టులో ఏముందో తెలియదు అని పేర్కొన్న పట్నం నరేందర్ రెడ్డి లేఖలో తన పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అని స్పష్టం చేశారు. కేటీఆర్ గురించి కానీ, కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు తన నుంచి తీసుకోలేదని నరేందర్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. కోర్టుకు వచ్చిన తర్వాత అడ్వకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని అప్పటివరకు అందులో ఏముందో తనకు తెలియదన్నారు.

తాను ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదన్న పట్నం నరేందర్ రెడ్డి
అసలు తాను చెప్పానని పోలీసులు కేటీఆర్ పేరును రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించడాన్ని ఆయన తప్పు పట్టారు. కేటీఆర్ గురించి, కేసు గురించి తాను ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక లగచర్లలో అధికారుల పైన దాడి ఘటన కేసులో ఏ 1 నిందితుడిగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన తాజాగా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటీషన్ సోమవారం విచారణ
అయితే వికారాబాద్ జిల్లా కోర్టు ఆయన పిటిషన్ ను సోమవారం నాడు విచారించనుంది. కలెక్టర్ తో పాటు అధికారుల పైన దాడి చేసిన కేసులో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని బుధవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. ఇక జైల్లో నుండే ఆయన ఒక లేఖను విడుదల చేశారు.
కేటీఆర్ ను కలిసిన లగచర్ల రైతులు,,, కేటీఆర్ భరోసా
ఇదిలా ఉంటే లగచర్ల రైతులు తెలంగాణ భవన్ కు వచ్చి తమ గోడు కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు దీంతో రైతులను ఢిల్లీ తీసుకువెళ్తానని కేటీఆర్ హామీ ఇచ్చారని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ వద్దకు తీసుకువెళ్తానని కేటీఆర్ స్పష్టం చేశారు మరోవైపు కలెక్టర్ పై దాడి ఘటనలో నిందితులను కలిశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయిన వారికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications