Phone Tapping Case:కేసీఆర్ కు నోటీసులు, విచారణ - కీలక మలుపు..!?
తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు. సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలను సిట్ విచారించింది. హరీష్, కేటీఆర్, సంతోష్ విచారణ చేసిన సిట్ ఇప్పుడు నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించేందుకు సిద్దమవుతోంది. ఈ రోజు నోటీసులు జారీ చేసి... రేపు విచారణ చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కేసీఆర్ విచారణ తరువాత సిట్ తీసుకునే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
రాజకీయంగా సంచలనాలకు కారణమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయ ప్రముఖులు.. ఇతర రంగాలకు చెందిన వారి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయనే వ్యవహారం పై సిట్ విచారణ చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్ ను సిట్ సుదీర్ఘంగా విచారించింది. అవసరం అయితే మరోసారి విచారణకు పిలుస్తామని స్పష్టం చేసింది. అదే విధంగా కేసీఆర్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్.. ఐపీఎస్ అధికారుల నుంచి సిట్ స్టేట్మెంట్స్ తీసుకుంది. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు విచారణ ముందుకు తీసుకెళ్తున్నారు. కాగా, ఇప్పుడు ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అందు లో భాగంగా సిట్ లోని ముఖ్య అధికారులు సమావేశం అయ్యారు.

కేసీఆర్ విచారణతో కొత్త మలుపు
ప్రస్తుతం ఫాం హౌస్ లో ఉన్న కేసీఆర్ కు ఈ సాయంత్రం లోగా నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. ఇదే అంశం పైన సిట్ అధికారులు చర్చలు చేస్తున్నట్లు సమాచారం. రేపు ఫాం హౌస్ లోనే కేసీఆర్ ను విచారణ చేయాలా... లేక, విచారణ కార్యాలయంలోనే నిర్వహించాలా అనేది తాజా భేటీలో అధికారులు నిర్ణయించనున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాల పైన ఏర్పాటు చేసిన కమీషన్ ఎదుట హాజరైన కేసీఆర్ తన వివరణ ఇచ్చారు. ఆ తరువాత ఈ కేసును సీఎం రేవంత్ సీబీఐకు అప్పగించారు. ఇక.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తున్న సిట్ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటంతో తదుపరి కార్యాచరణ పైన ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడదలై.. రాజకీయంగా ఎన్నికల పైన పార్టీ నేతలు ఫోకస్ చేసారు. ఈ సమయంలో వరుసగా బీఆర్ఎస్ నేతలు కేసుల్లో విచారణకు హాజరు అవ్వటం ఆ పార్టీలో చర్చగా మారింది. ఇక.. నోటీసులు అందిన తరువాత కేసీఆర్ స్పందన ఏంటనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications