భారీ వర్షం: తడసిముద్దయిన హైదరాబాద్, లోతట్టు ప్రాంతాలు మునక (పిక్చర్స్)

హైదరాబాద్: హైదరాబాదు నగరం శుక్రవారం సాయంత్రం భారీ వర్షంతో తడిసి ముద్దయింది. చాలా రోజుల తర్వాత హైదరాబాదులో వర్షం పడింది. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

ప్రధాన రహదారులన్నీ నదీ ప్రవాహాన్ని తలపించాయి. ఖైరతాబాద్, పంజాగుట్ట, టౌలీచౌకీ, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, తార్నాక, ఉప్పల్, నాగోల్, కొత్త పేట, దిల్‌సుఖ్‌నగర్, సాగర్ రోడ్డు, ఎల్బీనగర్, వనస్థలిపురం, చాంద్రయణగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ప్రధాన పాటు జాంబాగ్, ఎంజె మార్కెట్, అంబర్‌పేట టీ జంక్షన్, ఖైరతాబాద్, దిల్‌సుఖ్‌నగర్ కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో వాహనాలు బారులు తీరాయి. మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అల్పపీడన ప్రభావంతోనే..

అల్పపీడన ప్రభావంతోనే..

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని అనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని, ఈ ప్రభావంతో రాగల 48 గంటల్లో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాదులోని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

జలమయమైన ప్రాంతాలు...

జలమయమైన ప్రాంతాలు...

హైదరాబాదులోని బాగ్‌లింగంపల్లి క్వార్టర్స్, పాలమూరు బస్తీ, నాగమయ్య కుంట, బాపూజీ నగర్, అంబేద్కర్ నగర్, తాళ్ల బస్తీ, జాంభవీనగర్, చిక్కడపల్లి, లంబాడీ బస్తీ జలమయం అయ్యాయి.

పాతబస్తీ ప్రాంతాలు కూడా..

పాతబస్తీ ప్రాంతాలు కూడా..

హైదరాబాదు పాతబస్తీలోని ఛత్రినాక, లిలితాబాగ్, ఇంజన్‌బౌలి, ఫూల్‌బాగ్, మదీనా, గౌలిపుర, తలాబ్‌కట్ట, అమ్మన్‌నగర్, బండ్లగూడ ప్రాంతాలలో నడుం లోతు మేర నీళ్లు నిలిచిపోయాయి.

ఫిలింనగర్‌లోనూ అదే పరిస్థితి

ఫిలింనగర్‌లోనూ అదే పరిస్థితి

ఇక ఫిలింనగర్, బోరబండ, పర్వత్‌నగర్, ఎన్టీఆర్‌నగర్ వంటి బస్తీలు, కూకట్‌పల్లి సర్కిల్ ప్రాంతంలో గల మైత్రీ కాలనీ, శ్రీహరి నగర్, హబీబ్‌నగర్, దీన్ దయాళ్‌నగర్, ప్రభాకర్‌రెడ్డి నగర్, అల్వీన్ కాలనీల్లో వర్షపు నీరు భారీగా చేరింది.

బిక్కుబిక్కుమంటూ..

బిక్కుబిక్కుమంటూ..

ఫీల్‌ఖానా, జియాగూడ, ధూల్‌పేట, మంగళ్‌హాట్ బస్తీల ప్రజల బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇళ్లకు నీరు చేరే పరిస్థితి ఏర్పడడంతో వారు భయాందోళనలకు గురయ్యారు.

చిక్కిపోయిన వాహనాలు..

చిక్కిపోయిన వాహనాలు..

నీరు చేరిన రోడ్లపై హైదరాబాదులోని పలు చోట్ల కార్లు, ద్విచక్రవాహనాలు చిక్కుకుపోయాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచింది.

చెట్ల కిందికి చేరిన ప్రజలు..

చెట్ల కిందికి చేరిన ప్రజలు..

భారీ వర్షం నుంచి రక్షించుకోవడానికి ప్రజలు చెట్ల కిందికి చేరారు. అయినా అవి వారిని తడిసి ముద్ద కాకుండా నిరోధించలేకపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+