PM Modi: ఎస్సీ వర్గీకరణకు కమిటీ-ప్రధాని మోడీ హామీ-కాంగ్రెస్,బీఆర్ఎస్ పై నిప్పులు..

అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు వచ్చిన బంధువులకు నా శుభాకాంక్షలు అంటూ ప్రధాని మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. పండుగ సమయంలో తమ సొంత మనుషుల మధ్యకు వచ్చినప్పుడు ఆ సంతోషం రెట్టింపవుతుందని మాదిగల్ని ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగను తన చిన్న తమ్ముడిగా ఆయన అభివర్ణించారు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో చాలా ప్రభుత్వాల్ని చూశామని, తమ ప్రభుత్వ ప్రాధాన్యత మాత్రం సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనే నినాదంతో సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తోందన్నారు. గుర్రం జాషువాను ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ ఒకే లక్ష్యంతో అణగారిన వర్గాల కోసం పోరాటాలు చేస్తున్నారని, ఇప్పుడు ఆయనకు తాను కూడా తోడయినట్లు ప్రధాని మోడీ తెలిపారు. స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన ఎన్నో పార్టీలు, ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చాయని, తప్పాయని కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చానన్నారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దళితులకు ఇచ్చిన హామీలన్నీ ఎలా విస్మరించాయో ప్రధాని మోడీ వివరించారు. తెలంగాణ రాకముందు దళితుడిని సీఎం చేస్తానన్న బీఆర్ఎస్, మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్, అధికారంలోకి వచ్చాక దళిత బంధు పేరుతో కూడా వారిని మోసం చేశారన్నారు. ఆయన కుటుంబానికి మాత్రం కావాల్సిన మేలు చేసుకున్నారన్నారు.

pm modi lashed out at brs and congress for deceiving dalits, gives key assurance

గతంలో బీఆర్ అంబేద్కర్ ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ప్రధాని మోడీ అన్నారు. దళిత ద్రోహి అయి బీఆర్ఎస్ తో ఎంత జాగ్రత్తగా ఉండాలో కాంగ్రెస్ తోనూ అంతే జాగ్రత్తగా ఉండాలన్నారు. అంబేద్కర్ రెండుసార్లు ఎన్నికలలో పోటీ చేస్తే ఓడించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా పార్లమెంటులో ఆయన విగ్రహం పెట్టనివ్వలేదన్నారు. బీజేపీ హయాంలోనే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన విగ్రహం పెట్టడంతో పాటు ఆయనకు భారతరత్న ఇచ్చామన్నారు.

బీజేపీ రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్ర పతి అభ్యర్ధిగా నిలబెడితే కాంగ్రెస్ ఆయన్ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డిందని ప్రధాని మోడీ గుర్తుచేశారు. కోవింద్ రాష్ట్రపతి అయ్యాక ఆయన దేశం మొత్తానికి, మనందరికీ రాష్ట్రపతిగా ఉన్నారని, అయినా కాంగ్రెస్ ఆయన్ను తిరస్కరించిందన్నారు. దేశంలో తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మును నిలబెడితే ఆమెను కూడా కాంగ్రెస్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. రాజస్తాన్ లో పుట్టిన తెలంగాణను కర్మభూమిగా మార్చుకున్న హీరాలాల్ సామరియాను ఛీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా తాము నియమించామన్నారు.

ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ గతంలో తనకు అత్యంత సన్నిహితుడైన రాం విలాస్ పాశ్వాన్ ను రాజ్యసభకు పంపకుండా ఎలా అవమానించారో గుర్తించాలని ప్రధాని మోడీ తెలిపారు. కానీ తాను మాత్రం ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ను ఎంపీని చేశామన్నారు. బీహార్లోనే దళిత నేత జీతన్ రామ్ మాంఝీని కూడా నితీశ్ నిండు సభలో అవమానించారన్నారు. అవినీతి విషయంలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయన్నారు. అవినీతిలో ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి బీఆర్ఎస్ లిక్కర్ స్కాంలో అవినీతికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సహకరిస్తోందన్నారు. తెలంగాణలో ఇరుపార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయని, పరస్పరం తెరవెనుక సహకరించుకుంటున్నాయని మోడీ ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందన్నారు. పేదల కోసం కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని, ఇందులో ఎస్సీ, ఓబీసీలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. మీరు నన్ను ప్రధానిగానే గుర్తిస్తారని, కానీ తాను గతంలో బంగారు లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీలో పనిచేశానని మోడీ గుర్తుచేశారు.

గత 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం ఎస్సీలు చేస్తున్న పోరాటాన్ని తాము గుర్తించామని ప్రధాని మోడీ తెలిపారు. మాదిగల వర్గీకరణ కోసం త్వరలో కమిటీ వేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తానని స్పష్టం చేశారు. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం హామీ ఇవ్వగలదన్నారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేసే సత్తా బీజేపీకే ఉందన్నారు. మీ న్యాయపరమైన పోరాటంలో తాను తోడుగా ఉంటానని మోడీ హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+