నిఘా నీడలో... నగరం మోడీ మయం, షెడ్యూల్: అలజడి భయంతో అరెస్ట్

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ప్రధానికి ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఆయన రాష్ట్రంలో గజ్వేల్‌లో మిషన్ భగీరథ పథకం ప్రారంభంతోపాటు 1200 మెగావాట్ల జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్, కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయంకు శంకుస్థాపన చేస్తారు.

ప్రధాని రాక నేపథ్యంలో ఆయన రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చలో గజ్వెల్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గజ్వెల్ వెళ్లే అన్ని వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు.

నల్గొండ జిల్లా భువనగిరిలో పదిహేనుమంది కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. పటాన్ చెరులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడి వివాహానికి హాజరైన జగ్గారెడ్డి.. ఆ తర్వాత బయటకు వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని సభలో అలజడి సృష్టిస్తారనే సమాచారంతో ముందస్తు అరెస్టు చేశారు. గజ్వెల్ వెళ్లి దారిలో ప్రతి కిలోమీటర్‌కు ఓ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాని మోడీ

ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ప్రధానికి ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాదులో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

అరేంజ్‌మెంట్స్

అరేంజ్‌మెంట్స్

మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఆయన రాష్ట్రంలో గజ్వేల్‌లో మిషన్ భగీరథ పథకం ప్రారంభంతోపాటు 1200 మెగావాట్ల జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్, కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయంకు శంకుస్థాపన చేస్తారు.

ఇదీ ప్రధాని షెడ్యూల్..

ఇదీ ప్రధాని షెడ్యూల్..

ప్రధాని మోడీ ఆదివారం మధ్యాహ్నం గం.2.20కు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం గం.2.25కు హెలికాప్టర్లో, రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి.. మధ్యాహ్నం గం.2.55 గంటలకు కోమటిబండ చేరుకుంటారు.

ఇదీ ప్రధాని షెడ్యూల్..

ఇదీ ప్రధాని షెడ్యూల్..

మధ్యాహ్నం గం.3.05కు మిషన భగీరథపై పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్ ఉంటుంది. మధ్యాహ్నం గం.3.06-3.08 గంటల మధ్య మిషన్ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.

ఇదీ ప్రధాని షెడ్యూల్..

ఇదీ ప్రధాని షెడ్యూల్..

మధ్యాహ్నం గం.3.08-3.10 గంటలు మిషన్ భగీరథ స్విచాన్‌ చేస్తారు. మధ్యాహ్నం గం.3.20కు పవర్‌ ప్లాంట్లు, రైల్వే లైను, ఎరువుల ఫ్యాక్టరీ, హెల్త్‌ వర్సిటీలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం గం.3.40రకు బహిరంగ సభ ఉంటుంది.

ఇదీ ప్రధాని షెడ్యూల్..

ఇదీ ప్రధాని షెడ్యూల్..

గం.4.25కు హెలిపాడ్‌కు చేరుకొని, అక్కడి నుంచి గం.4.55కు బేగంపేట విమానాశ్రయం వస్తారు. సాయంత్రం గం.5.15కు ఎల్బీ స్టేడియంలో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 6.40 గంటలకు బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశమవుతారు.

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల ఫోటోలను పరిశీలిస్తున్న పోలీసులు.

ఎల్బీ స్టేడియం వద్ద తనిఖీలు

ఎల్బీ స్టేడియం వద్ద తనిఖీలు

ప్రధాని నరేంద్ర మోడీ తన తెలంగాణ పర్యటనలో భాగంగా.. సాయంత్రం ఎల్బీ నగర్‌లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా స్టేడియం వద్ద పోలీసుల తనిఖీలు.

బీజేపీ నేతలు

బీజేపీ నేతలు

ప్రధాని నరేంద్ర మోడీ తన తెలంగాణ పర్యటనలో భాగంగా.. సాయంత్రం ఎల్బీ నగర్‌లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ నేతల చర్చలు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ తన తెలంగాణ పర్యటనలో మధ్యాహ్నం ప్రభుత్వ, సాయంత్రం ఎల్బీ నగర్‌లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయనను ఆహ్వానిస్తూ నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.

నిఘా నీడలో... నగరం మోడీ మయం, షెడ్యూల్: అలజడి భయంతో అరెస్ట్

నిఘా నీడలో... నగరం మోడీ మయం, షెడ్యూల్: అలజడి భయంతో అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు. మోడీ రాక నేపథ్యంలో ప్రధాని కాన్వాయ్ రిహార్సల్స్‌ను శనివారం నాడు హైదరాబాదులో నిర్వహించిన దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+