బండారు దత్తాత్రేయ మనవరాలి పాటకు ప్రధాని మోడీ ఫిదా (వీడియో)
హైదరాబాద్: తనపై ఓ చిన్నారి పాడిన పద్యానికి ప్రధాని నరేంద్ర మోడీ ముగ్ధులయ్యారు. ఆ చిన్నారి ఎవరో కాదు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మనవరాలు జశోధర. ఆమె ప్రధాని మోడీని ప్రశంసిస్తూ ఒక పద్యాన్ని ఎంతో ఆనందంగా పాడారు. ఆ చిన్నారి పాడిన పద్యం వీడియోను బండారు దత్తాత్రేయ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
ఈ వీడియోపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. 'సృజనాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆమె పలుకులు అద్భుత శక్తికి మూలాలు' అని మోడీ సమధానమిస్తూ ఆ వీడియోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు ఆ చిన్నారిని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Creative and adorable. Her words are a source of great energy as well. https://t.co/9BTgtFkpH9
— Narendra Modi (@narendramodi) December 10, 2023
కాగా, బండారు దత్తాత్రేయ గతంలో నరేంద్ర మోడీ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి బీజేపీ సీనియర్ నేతగా ఉన్న ఆయన ఆ తర్వాత గవర్నర్ గా నియమితులయ్యారు. పలు రాష్ట్రాల గవర్నర్ గా పనిచేసిన దత్తాత్రేయ.. ఇప్పుడు హర్యానా గవర్నర్‌గా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం బండారు దత్తాత్రేయ కూతురు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆమెకు ఇటీవల ఈ బాధ్యతలు అప్పగించారు. విజయలక్ష్మి ప్రస్తుతం అలయ్ బలయ్ ఫౌండేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని విజయలక్ష్మి భావించినప్పటికీ.. ఆ తర్వాత పార్టీ నిర్ణయంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా ఆమెను నియమించారు కిషన్ రెడ్డి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications